తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకతాటిపైకి నడిపేందుకు కీలక సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. విబేధాలను వదిలి అంతా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో అందరి నేతల అభిప్రాయం తీసుకున్న రాహుల్.. భేటీకి సంబంధించిన విషయాలను ముగ్గురు మాత్రమే మీడియాకు వెల్లడించాలని సూచించారు. దీంతో.. సమావేశం ముగిసిన తర్వాత.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాలో ఉన్న విబేధాలపై రాహుల్ గాంధీతో చర్చ జరిగిందని, జరిగింది జరిగి పోయింది. ఇక అందరం కలిసి పని చేస్తామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్, ఎంఐఎం లతో సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు, రాహుల్ టికెట్లు అనౌన్స్ చేస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కలిసి…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖార్గే, అధిరంజన్ చౌధురి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు తదితర ఎంపీలు పాల్గొన్నారు.…
కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల తీరును కేసీఆర్ తప్పు పట్టారని, కానీ ఐఏఎస్ ఐపీఎస్‌ల వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఉత్తమ్ అన్నారు. 14 మంది ఐఏఎస్‌లను తప్పించి.. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లను సీఎస్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.…
కేసీఆర్ తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేశారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నల్గొండలోని దేవర కొండలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ పార్టీని ఉత్తమ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి 100 కోట్లు ఖర్చుపెట్టిన రియల్ వ్యాపారిని ఓడించి నన్ను గెలిపించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం వారసులమన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా కాంగ్రెస్…
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2017లో ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారే ఎరువుల ధరలను 50 శాతం పెంచడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. Read Also: జంటనగరాల…
కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై చర్చించారు. అంతేకాకుండా 2023లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హుజుర్ నగర్, కోదాడ ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం మాఫియాలో మునిగితేలుతున్నారని, వచ్చే ఎన్నికల్లో హుజుర్ నగర్, కోదాడలో భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, ఏడాది తరువాత టీఆర్‌ఎస్ పీడ వదులుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది…
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి.
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల సమ్మెపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ సమ్మె కొనసాగిందని పార్లమెంట్లో ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలాన్ని ఆపి వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని సోమవారం లోక్‌సభలో జీర్ అవర్‌లో అత్యవసర ప్రజాప్రయోజనాల అంశం కింద కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన డిమాండ్‌పై ప్రహ్లాద్ జోషి…
తెలంగాణ పరిధిలో సత్తుపల్లి, కొత్తగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని లోని నాలుగు బొగ్గుగనుల వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బొగ్గుగనుల వేలం ప్రక్రియను కేంద్రం విరమించుకోవాలని కోరుతూ మూడు రోజులపాటు కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెకారణంగా తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో సింగరేణికి సుమారు రూ. 120 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. లోక్‌సభలో ఈరోజు జీరో అవర్‌లో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బోగ్గుగనుల వేలం…