5 Indian-Americans In Race For US Congress's Midterm Elections: అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికారం కోల్పోయిన రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. నవంబర్ 8న యూఎస్ఏలో ఈ మధ్యంతర ఎన్నిలకలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు భారతీయ-అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఐదుగురు పక్కాగా గెలుస్తారని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
South Korea Scrambles Jets After Detecting 180 North Korea Warplanes: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరుకున్నాయి. వరసగా ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో పదుల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా. ఉత్తర్ కొరియా చర్యను ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది దక్షిణ కొరియా. నార్త్ కొరియా ప్రయోగించిన కొన్ని క్షిపణులు దక్షిణ కొరియా సరిహద్దుల్లో పడ్డాయి.
India Abstains On Russian-Sponsored Resolution Against Ukraine At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ పై రష్యా ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. అమెరికా, ఉక్రెయిన్ ల్యాబుల్లో ‘సైనిక జీవసంబంధ కార్యకలాపాలు’ జరుగుతున్నాయని రష్యా ఆరోపిస్తూ.. ఈ తీర్మానాన్ని భద్రతా మండలి ముందుకు తీసుకువచ్చింది. దీన్ని పరిశోధించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని రష్యా కోరింది. జీవ ఆయుధాల ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని రష్యా ఆరోపించింది
North Korea fired at least 10 missiles of various types on Wednesday: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను జరిపింది. బుధవారం రోజున ఏకంగా 10 క్షిపణులను ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియా అలెర్ట్ ప్రకటించింది. తమ ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించింది. బాలిస్టిక్ క్షిపణి దక్షిణ కొరియా జాలాలకు దగ్గర్లో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దీన్ని కవ్వింపు చర్యగా దక్షిణ కొరియా అభివర్ణించింది. మరోవైపు రెండు దేశాల వివాదాస్పద…
Monkeypox still a global health emergency, says WHO: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని డబ్ల్యూహెచ్ఓ నిర్ణయించింది. ఎమర్జెన్సీ కమిటీ మంకీపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని మంగళవారం నిర్ణయించింది. ఈ ఏడాది జూలైలో మంకీపాక్స్ ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ప్రస్తుతం దీన్ని మరికొంత కాలం కొనసాగించనున్నారు. మంకీపాక్స్ కట్టడికి ప్రపంచ దేశాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అత్యవసర కమిటీ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ…
Donald Trump's key comments on Elon Musk's Twitter Takes Over: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ ను ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఊగిసలాటకు తెరదించారు. రావడం రావడంతోనే పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు మస్క్. సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు, సీఎఫ్ఓ నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ అధికారిని విజయగద్దెను తొలగించారు. ఇదిలా ఉంటే…
China Enshrines Opposition To Taiwan Independence Into Its Constitution: చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. దీంతో పలు కీలక తీర్మాణాలు చేస్తోంది ఆ పార్టీ. దీంట్లో భాగంగానే తైవాన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శనివారం తన రాజ్యాంగంలో తైవాన్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా నిబంధనలను తీసుకువచ్చింది. తైవాన్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ముగింపు సమావేశాల్లో తీర్మాణం చేసింది.
USA should be ready to stop Chinese invasion says US Official: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో చైనా కూడా తైవాన్ ద్వీపాన్ని ఎప్పుడైనా ఆక్రమించుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షడు జిన్ పింగ్, తైవాన్ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తారు. చైనా సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే చూస్తు ఊరుకోం అని హెచ్చరికలు జారీ చేశారు. చైనాకు వ్యతిరేకంగా తైవాన్ దేశాన్ని రక్షించేందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండాలని అమెరికా సీనియర్ అధికారి సూచించారు.
EAM S. Jaishankar Comments on india's foreign policies:భారత విదేశాంగ విధానం గురించి విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. నేను ఏం చేస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. విదేశాంగ శాఖ మంత్రిగా యూఎస్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు ప్రయాణిస్తున్నానని మీరు చదివి ఉంటారు..కానీ నేను ఏం చేస్తానో, ఓ విదేశాంగ మంత్రి ఏం చేస్తాడో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
Snake on Plane: సాధారణంగా మన ఇంటికి పాములు వస్తే చాలా కంగారు పడుతుంటాము. అది వెళ్లిపోయే వరకు లేకపోతే చంపే వరకు నిద్రపోము. అలాంటిది విమానంలో పాము కనిపిస్తే ఎలా ఉంటుంది. ప్రయాణికులు ఎంతగా ఆందోళన చెందుతారో ఊహించుకోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది. ప్రయాణికులు పామును గుర్తించడంతో విమానాన్ని తనిఖీ చేసి పామును బయటకు తీశారు.