Multiple fatalities in shooting at US Walmart store: అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియాలోని ఓ వాల్ మార్ట్ స్టోర్ లో దుండగుడు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి సమయంలో ఈ కాల్పులు జరిగాయి. వర్జీనియాలోని చీసాపీక్ లోని వాల్ మార్ట్ కాల్పుల్లో 14 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. మాల్ మార్ట్ లో మేనేజర్ గా చేస్తున్న వ్యక్తే ఈ కాల్పులకు తెగబడ్డాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని కాల్చి చంపారు.
Read Also: Doctors Refused To Touch HIV Woman: హెచ్ఐవీ గర్భిణికి వైద్యం అందించడానికి నిరాకరించిన డాక్టర్లు.
పోలీసుల కథనం ప్రకారం.. రాత్రి 10.12 గంటలకు కాల్పులు జరిగాయి. ఘటన జరిగిన వెంటనే పోలీసులు షాపింగ్ మాల్ లోకి ప్రవేశించే సమయానికే చాలా మంది చనిపోయి ఉన్నారని పోలీస్ అధికారి కోసిన్స్కి తెలిపారు. పోలీసులు ఇంకా నిర్ధిష్టంగా మరణాల సంఖ్యను ధృవీకరించలేదు. పది మంది కన్నా ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. చీసాపీక్ పోలీస్ అధికారి కోసిన్స్కీ మాట్లాడుతూ.. కాల్పులకు పాల్పడిన దుండగుడిని హతమార్చినట్లు వెల్లడించారు.