Sitharaman's ‘rupee not sliding but dollar strengthening’ remark: ఇటీవల కాలంలో రూపాయి విలువ ఎప్పుడూ లేని విధంగా పడిపోతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతోంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూపాయి పడిపోవడం లేదని.. డాలర్ బలపడుతోందని ఆమె అన్నారు. ఇది అన్ని దేశాల కరెన్సీపై ప్రభావం చూపిస్తుందని ఆమె అన్నారు. అనేక ఇతర…
Pakistan summons US envoy over Joe Biden's comments: పాకిస్తాన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలపై సమన్వయం లేని కారణంగా పాకిస్తాన్ ప్రపంచంలోనే ప్రమాదకర దేశాల్లో ఒకటి అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి. అమెరికాతో ఇప్పుడిప్పుడే సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని అనుకుంటున్న పాకిస్తాన్ కు ఇది మింగుడు పడటం లేదు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తమ నిరసన తెలుపుతోంది.
Kidnapped Indian-Origin Family Of 4 Found Dead In US: అమెరికాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన భారతసంతతి కుటుంబం దారుణంగా హత్యకు గురైంది. ఎనిమిది నెలల పాపతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానిక భారత సంతతిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిది నెలల అరోహి ధేరి, పాప తల్లిదండ్రులు 27 ఏళ్ల జస్లిన్ కౌర్, 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 39 ఏళ్ల మేనమామ అమన్…
North Korea Fires 2 Ballistic Missiles: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతోంది. గురువారం మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది నార్త్ కొరియా. మంగళవారం కూడా ఇలాగే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ మీదుగా ప్రయోగించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తలు పెంచేందుకు నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలు చేపడుతోందని యూఎస్ఏ ఆరోపించింది.
Trump sues CNN claiming defamation: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎన్ఎన్ మీడియా సంస్థపై ఏకంగా 475( సుమారుగా 3,900కోట్లు) మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సీఎన్ఎన్ వార్తకథనాలు ప్రచురించిందని కోర్టులో సమర్పించిన వ్యాజ్యంలో పేర్కొన్నారు ట్రంప్. తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తకథనాలను ప్రచారం చేసిందని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో 29 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
4 Indian-Origin People Kidnapped In US: అమెరికాలో 8 ఏళ్ల పాపతో పాటు నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేశారు దుండగులు. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో సోమవారం ఈ ఘటన జరిగింది. కిడ్నాప్ అయిన వారిలో ఎనిమిది నెలల పాపతో పాటు ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్ తో పాటు వారి ఎనిమిది నెలల పాప అరూహి ధేరితో పాటు 39 ఏళ్ల అమన్ దీప్ సింగ్…
1984 One Of "Darkest Years" In Indian History says US Senator:ఆధునిక భారతదేశంలో 1984 సంవత్సరాన్ని చీకటి సంవత్సరంగా అభివర్ణించారు అమెరికా సెనెటర్ పాట్ టూమీ. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు భారతదేశ చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోయిందని అన్నారు. సిక్కులపై జరిగిన అల్లర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 31, 1984న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు సిక్కు అంగరక్షకులు చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు…
EAM Jaishankar comments on Pakistan: విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఇంటర్నేషనల్ టెర్రరిజం(ఐటీ)లో ఎక్స్పర్ట్ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ వడోదరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇప్పడు ప్రపంచం ఉగ్రవాదంపై గతం కన్నా మెరుగైన అవగాహనతో ఉందని ఆయన అన్నారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించదని.. ఇప్పడు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న…
Putin Comments On India: ఉక్రెయిన్ లోని జోపోరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ నాలుగు ప్రాంతాలను అధికారికంగా రష్యా తనలో కలుపుకుంది. అయితే దీనిపై యూఎస్ఏతో పాటు యూరోపియన్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. రష్యా బెదిరింపుకు భయపడేది లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు రష్యాపై మరింతగా ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యాయి. జి 7 దూశాలు కూడా రష్యా, ఉక్రెయిన్ భూభాగాలను…
Anti-Hijab Protests in iran: ఇరాన్ లో పది రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు మహ్సాఅమిని అనే 22 ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. పోలీసులు దాడి చేయడంతోనే ఆమె మరణించిందని ఆరోపిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ నిరసనల్లో పాల్గొంటున్నారు.