US’s Example On Key Immunity For Saudi Crown Prince: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కు అమెరికా ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తామని అమెరికా విదేశాంగ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. 2014లో నరేంద్రమోదీకి ఇచ్చిన విధంగానే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు కూడా నిబంధనలు వర్తింప చేస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ అన్నారు. అమెరికా ఇలా చేయడం మొదటిసారి కాదని గతంలో కూడా చేసిందని అన్నారు.
Read Also: Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది.. రేవంత్ తీరు సరిగ్గా లేదు
గతంలో 1993లో హైతీలో ప్రెసిడెంట్ అరిస్టైడ్, 2001లో 2001లో జింబాబ్వేలో ప్రెసిడెంట్ రాబర్ట్ ముగాబే, 2014లో భారత్‌లో ప్రధాని మోదీ, 2018లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్ కబిలాకు కూడా మినహాయింపులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2002 గుజరాత్ లోని గోద్రా అల్లర్లతో సంబంధం ఉందనే నెపంతో అమెరికా 2005లో ప్రధాని మోదీపై వీసా నిషేధం విధించింది. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత స్వయంగా అమెరికానే తమ దేశంలో పర్యటించాని ప్రధాని మోదీని ఆహ్వానించింది.
సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, అమెరికా పౌరుడైన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గిని అత్యంతదారుణంగా హత్య చేయించాడనే అరోపణలు ఉన్నాయి. టర్కీ మీదుగా అమెరికాకు వెళ్తున్న క్రమంలో ఖషోగ్గీని సౌదీ రాయబార కార్యాలయంలో హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సౌదీ ప్రభుత్వానికి, యువరాజుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడనే నెపంతో ఖషోగ్గీని హత్య చేయించాడనే అపవాదు ఉంది. ఈ హత్య అమెరికా, సౌదీ దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపించింది.