snowstorm buries western New York: అమెరికా వాణిజ్యనగరం న్యూయార్క్ వ్యాప్తంగా భారీగా హిమపాతం కురుస్తుంది. దీంతో నగరంలోని రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్ బఫెల్లో ప్రాంతంలో మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 6 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజా జీవితం స్తంభించింది. బఫెలో ప్రాంతంలో రోడ్లు మూసేశారు. అనేక విమానాలు రద్దు అయ్యాయి. నగరంలో ప్రయాణాలు దాదాపుగా పరిమితం చేయబడ్డాయి.
Read Also: Jeff Bezos: కార్లు, టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి.. ప్రజలకు అమెజాన్ అధినేత సూచన
శీతాకాలం ప్రారంభం కావడంతోనే మంచు తుఫానులు అమెరికాపై విరుచుకుపడుతున్నాయి. హిమపాతం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా పేరుకుపోయిన మంచులో కార్లు, ఇతర వాహనాలు చిక్కుకుపోయాయి. ఈ హిమపాతం వల్ల ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.
తుఫాన్ సమయంలో దాదాపుగా 280 మందిని రక్షించినట్లు న్యూయార్క్ గవర్నర్ కాథీ హెచుల్ తెలిపారు. మంచును తొలగించేందుకు ప్రభుత్వ సిబ్బంది పనిచేస్తోంది. మంచును తొలగించే వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ప్రజలను రక్షించేందుకు అన్ని అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు.
నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. ఇప్పటి వరకు రెండు ప్రదేశాల్లో 6 అడుగుల కన్నా ఎక్కువ హిమపాతం నమోదు అయింది. విస్కాన్సిన్, మిచిగాన్, ఇండియానా ఒహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్ ప్రాంతాల్లో 80 లక్షల మంది మంచు తుఫాను కారణంగా ప్రభావితం అయ్యారు. శీతాకాలం ప్రారంభం నెలకన్నా ముందే ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ సీజన్ లో తొలి మంచు తుఫాన్ ఎదుర్కొంటోంది అమెరికా. లేక్ ఏరీ, లేక్ అంటారియో నుంచి చలిగాలులు వీస్తున్నాయి. సోమవారం ఉదయం వరకు హిమపాతం సంభవించే అవకాశం ఉందని అక్కడి వాాతావరణ కేంద్రం వెల్లడించింది.