US VISA: వ్యాపారం లేదా విశ్రాంతి కోసం యునైటెడ్ స్టేట్స్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? మళ్లీ ఆలోచించండి. ఎందుకంటే మీరు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. దాదాపు మూడేళ్లు అంటే దాదాపు 1000 రోజులు వేచి ఉండాల్సిందే. నాన్-ఇమ్మిగ్రెంట్ విభాగంలో ఎవరైనా బీ1(బిజినెస్), బీ2(టూరిస్ట్) వీసాపై అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే వారికి 2025 జూన్ లేదా జులైలో వీసా అపాయింట్‌మెంట్ లభించనుంది. భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకుల కోసం అమెరికా ఎంబసీ వారు వివిధ రకాల టూరిస్ట్ వీసాలు జారీ చేస్తారు. దరఖాస్తుదారులకు వీసా అపాయింట్‌మెంట్ కోసం పట్టే సమయంలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఎంబసీ, కాన్సులేట్‌లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్‌డేట్ చేస్తుంటారు. భారత్‌లో దిల్లీ ఎంబసీతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతా కాన్సులేట్ల నుంచి వీసా జారీ సేవలు అందిస్తోంది. తాజాగా ఈ కేంద్రాల నుంచి వీసా కోసం నిరీక్షణ సమయం అమెరికా అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో వీసా అపాయింట్‌మెంట్ కోసం B1 (వ్యాపారం), B2 (పర్యాటక) వీసా దరఖాస్తుదారులు దాదాపు 1000 రోజులు వేచి ఉండాల్సిందే.
Team India: వీడని సస్పెన్స్.. బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ దూరం
ముంబయిలో నివసించే వారికి 999 రోజులు, ఢిల్లీలో నివసించే వారికి 961 రోజులు, హైదరాబాద్‌కు 994 రోజులు, చెన్నై వాసులు అపాయింట్‌మెంట్ పొందడానికి 948 రోజులు వేచి ఉండాల్సి ఉండగా, కేరళలో 904 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంది. బీ1, బీ2 వీసా దరఖాస్తుదారులు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే 2025 సంవత్సరంలో ఇంటర్వ్యూ కోసం తేదీని పొందవచ్చు. ఈ నెల ప్రారంభంలో యూఎస్‌ఎంబసీ సీనియర్ అధికారి ఒకరు బీ1, బీ2 వీసాల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను దాదాపు తొమ్మిది నెలలు తగ్గొచ్చని తెలిపారు. అయితే దరఖాస్తుల సంఖ్య, ఇప్పటికే ఉన్న బ్యాక్‌లాగ్ కారణంగా వేచి ఉండే సమయం తగ్గడానికి నెలల సమయం పట్టవచ్చు. ఇతర వీసాలకు ఈ వెయిటింగ్ లిస్ట్ కాస్త తక్కువగానే ఉంది.