5 Indian-Americans In Race For US Congress’s Midterm Elections: అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికారం కోల్పోయిన రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. నవంబర్ 8న యూఎస్ఏలో ఈ మధ్యంతర ఎన్నిలకలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు భారతీయ-అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఐదుగురు పక్కాగా గెలుస్తారని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరంతా కూడా అధికార డెమొక్రాట్ పార్టీకి చెందిన వారే. మళ్లీ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. వీరందరిలో సీరియర్ అయిన అమీ బెరా.. కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ నుంచి ప్రతినిధుల సభకు ఆరోసారి పోటీ చేస్తున్నారు. కాలిఫోర్నియా 17 కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రోఖన్నా, ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి కృష్ణమూర్తి, వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పమీలా జయపాల్ పోటీలో ఉన్నారు. శ్రీ తానేదార్ మిషిగాన్ లోని 13వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీలో ఉన్నారు.
Read Also: By-elections: ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు తేలేది నేడే..
అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌లు నలుగురు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థుల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నారు. చెన్నైలో జన్మించిన ప్రమీలా జయపాల్ ప్రతినిధుల సభకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయ అమెరికన్ మహిళగా రికార్డులకెక్కారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను ఇటు అధ్యక్షుడు బైడెన్ తో పాటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు భారతీయ-అమెరికన్లు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
2024లో మరోసారి పోటీలో నిలబడేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆయనకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. దీంతో పాటు జోబైడెన్ గ్రాఫ్ కూడా అమెరికాలో నానాటికి పడిపోతోంది. ఆర్థికమాంద్యం, వలసలను కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారని జోబైడెన్ అపవాదు ఎదుర్కొంటున్నారు. దీంతో అమెరికాలో జరిగే ఈ మధ్యంతర ఎన్నికలు కీలకం కాబోతున్నాయి.