Military Strength Ranking: ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా అమెరికా తొలిస్థానంలో నిలిచింది. రష్యా, చైనాలు వరసగా రెండూ, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్ 4వ స్థానంలో నిలిచింది. ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్సైట్ గ్లోబల్ ఫైర్‌పవర్ 2024కి గానూ
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు.
Anantapur: తెలుగు వైద్యుడు బావికాటి జయరాం నాయుడుకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వైద్య వృత్తిలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఓ వీధికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
China: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనాకు వ్యతిరేకిగా పేరొందిన లై చింగ్-తే గెలుపొందడం ఆ దేశానికి మింగుడు పడటం లేదు. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా తైవాన్ జనాలు పట్టించుకోలేదు. వరసగా మూడోసారి అధికార పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఇదిలా ఉంటే ఓటింగ్ ఫలితాలు, తైవాన్ పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP) తైవాన్ లోని ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించదని, తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి చెన్ జిన్హూవా వార్త సంస్థకు చెప్పారు.
Female Teacher: అమెరికాలో ఇటీవల కాలంలో మహిళా టీచర్లు వారి విద్యార్థులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటి ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. చదువు చెప్పాల్సిన టీచర్లు, మైనర్ విద్యార్థులతో సెక్స్ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తోటి విద్యార్థి వీరి సంబంధాన్ని బయటపెట్టాడు.
Lottery: అమెరికాలో ఓ వృద్ధ జంట అసలైన జీనియస్లని చెప్పొచ్చు. ఏకంగా 26 మిలియన్ డాలర్లు( రూ. 200 కోట్లు)లను లాటరీల్లో సంపాదించింది. ఇతంతా వారి అదృష్టం అంటే మీరు పప్పులో కాలేసిటనట్లే, వీరికి ఉన్న అపారమైన గణిత విద్యను, మ్యాథ్స్ ట్రిక్స్ ఉపయోగించి ఈ లాటరీలను సొంతం చేసుకున్నారు. మిషిగాన్ లోని ఎవర్ట్ ప్రాంతంలోని జెర్రీ, మార్జ్ సెల్బీ జంట ఒక స్టోర్ నిర్వహిస్తుండేవారు. ఈ క్రమంలో 60 ఏళ్లు దాటిన తర్వాత వీరు రిటైరై…
Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలను రేపుతున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఫైల్స్ అమెరికాలోని ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను బయటకు తెస్తోంది. ఇప్పటికే ఈ సెక్స్ స్కాండల్‌లో మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా మూడో బ్యాచ్ అన్సీల్డ్ డాక్యుమెంట్లు నిన్న విడుదలయ్యాయి.
Alaska Airlines Boeing 737 MAX: అలస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-9 MAX విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. టేకాఫ్ అయిన కొద్ధి నిమిషాలకే గాలిలో ఉండగానే విమానం డోర్ తెరుచుకుంది. దీంతో విమానం ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. ప్రయాణికులు ఈ ఘటనను చిత్రీకరించారు. దీంట్లో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
Kim Jong Un: వరస మిస్సైల్ టెస్టులు, గూఢాచర ఉపగ్రహాల ప్రయోగంతో కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు సవాల్ విసురుతున్నాడు. జపాన్, దక్షిణకొరియా, యూఎస్ వార్నింగులను ఖాతరు చేయడం లేదు ఉత్తర కొరియా నియంత. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మిస్సైల్ లాంచర్ల ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.
California: ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్న వీరు, మరోసారి ఇలాంటి ఘటనకే పాల్పడ్డారు. అమెరికా కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయాన్ని గ్రాఫిటీ పెయింట్స్‌తో ధ్ద్వంసం చేశారు. ఇదే ప్రాంతంలో కొన్ని వారాల క్రితం స్వామినారాయణ మందిరంపై కూడా ఇలాగే దాడికి తెగబడ్డారు. తాజాగా మరోసారి హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారు.