Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మరణించాడు. ఈ ఏడాది ఇది 5వ ఘటన. వరసగా జరుగుతున్న ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా భారతీయ సంతతికి చెందిన విద్యార్థి సమీర్ కామత్ సోమవారం శవమై కనిపించాడు. సమీర్ కామత్ ఇండియానా పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నారు. యూఎస్ సిటిజన్‌షిప్ ఉన్న కామత్ మరణంపై విచారణ జరుగుతోంది.
USA: అమెరికాలో భారత విద్యార్థిపై దుండగులు దాడి చేరారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఈ ఘటన చికాగోలో జరిగింది. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి తన ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దొంగల దాడికి గురయ్యాడు. తీవ్రంగా కొట్టి, అతని సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఈ దాడి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.
Candida Auris: అగ్రరాజ్యం అమెరికాను ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. క్యాండిడా ఆరిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అక్కడ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే వాషింగ్టన్ రాష్ట్రంలో ఈ నెలలో నలుగురు వ్యక్తులకు ఈ ఫంగస్ సోకింది. అత్యంత అరుదైన, ప్రాణాంతక ఇన్ఫెక్షన్ అని, దీని వల్ల అధిక మరణాల రేటు కలిగి ఉండటంతో పాటు డ్రగ్ రెసిస్టెంట్ కలిగి ఉండీ, సులభంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Pakistan: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో తలదాచుకున్నట్లు, 2011లో అతడిని చంపడానికి ముందే అమెరికా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 2011లో అమెరికన్ కమాండోలు పాకిస్తాన్‌లో అబోట్టాబాద్‌లో బిన్ లాడెన్‌ని చంపేశారు. తాజాగా జియో న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Iran: అమెరికా, వెస్ట్రన్ దేశాలకు మరోసారి ఇరాన్ షాక్ ఇచ్చింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పరిశోధన శాటిలైట్‌ని ప్రయోగించిన వారం రోజుల తర్వాత.. మూడు ఉపగ్రహాలను ఏకకాలంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇరాన్ ఆదివారం తెలిపింది. ‘‘ ఇరాన్ మూడు శాటిలైట్లను మొదటిసారిగా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు’’ అని ఆ దేశ మీడియా వెల్లడించింది. శాటిలైట్లను టూ-స్టేజ్ సీమోర్గ్(ఫీనిక్స్) ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఈ ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల కనిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
Peanut Allergy: ఒక విషాదకర సంఘటనలో బ్రిటన్ డ్యాన్సర్ అమెరికాలో మరణించింది. వేరుశెనగ అలర్జీతో బాధపడుతూ.. ఆ తర్వాత అనాఫిలాక్టిక్ షాక్ కారణంగా మరణించింది. మరణించిన డ్యాన్సర్‌ని 25 ఏళ్ల ఓర్లా బాక్సెండేల్గా గుర్తించారు. వాస్తవానికి లాంక్షైర్కి చెందిన ఓర్లా తనను తాను డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి న్యూయార్క్‌లో ఉంటోంది.
Unmukt Chand React on Playe against Team in T20 World Cup 2024: భారత మాజీ అండర్ 19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు వ్యతిరేకంగా ఆడటమే తన లక్ష్యమని తెలిపాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై తన ఆటను పరీక్షించుకోవాలనే ఆసక్తి ఉందని చెప్పాడు. త్వరలో ఉన్ముక్త్ లక్ష్యం నెరవేరనుంది. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) తరఫున ఆడుతున్న ఉన్ముక్త్ చంద్.. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాపై…
Snoring: బిగ్గరగా "గురక" పెట్టడం అతని ప్రాణాలను తీసింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల మధ్య గురక వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన అమెరికా పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకి పాల్పడినందుకు థర్డ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపబడ్డాయి.
చిరకాల మిత్రదేశాలైన ఇజ్రాయెల్- అమెరికా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. హమాస్ నియంత్రణలోని గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన సమయమంటూ చేసిన అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్ తిరస్కరించింది.