China: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనాకు వ్యతిరేకిగా పేరొందిన లై చింగ్-తే గెలుపొందడం ఆ దేశానికి మింగుడు పడటం లేదు. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా తైవాన్ జనాలు పట్టించుకోలేదు. వరసగా మూడోసారి అధికార పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఇదిలా ఉంటే ఓటింగ్ ఫలితాలు, తైవాన్ పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP) తైవాన్ లోని ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించదని, తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి చెన్ జిన్హూవా వార్త సంస్థకు చెప్పారు.
Read Also: Operation Sarvashakti: ‘ఆపరేషన్ సర్వశక్తి’ని ప్రారంభించిన ఆర్మీ.. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యం..
ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ఫలితాలను పట్టించుకోమని చైనా నేరుగా చెబుతోంది. జాతీయ పునరేకీకరణలో చైనా వైఖరి స్థిరంగా ఉందని.. మా సంకల్పం రాయిలా ధృడమైందంటూ చెన్ చెప్పాడు. వేర్పాటువాద ధోరణులను, తైవాన్ స్వాతంత్య్రం, విదేశీ జోక్యాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తైవాన్ ‘పునరేకీకరణ’ ఇంకా అనివార్యమైందని మరోసారి చైనా ప్రకటించింది.
వన్ చైనా విధానంలో తైవాన్ కూడా భాగమే అని జి జిన్‌పింగ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల న్యూ ఇయర్ ప్రసంగంలో కూడా తైవాన్‌ని స్వాధీనం చేసుకునే విధంగా జిన్ పింగ్ ప్రకటన చేశాడు. తైవాన్ ఏకీకరణ అనివార్యం అంటూ ప్రసంగించారు. కీలకమైన తైవాన్ కోసం చైనా, అమెరికా మధ్య విభేదాలు తారాస్థాయి చేరాయి. తైవాన్ స్వతంత్రంగా ఉండాలని అమెరికా అనుకుంటుంటే.. తైవాన్ తమ భూభాగమే అని చైనా బెదిరిస్తోంది. ఇప్పటికే తన ఆర్మీతో తైవాన్‌ని భయపెట్టాలా విన్యాసాలు చేస్తోంది.