Unmukt Chand React on Playe against Team in T20 World Cup 2024: భారత మాజీ అండర్ 19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు వ్యతిరేకంగా ఆడటమే తన లక్ష్యమని తెలిపాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై తన ఆటను పరీక్షించుకోవాలనే ఆసక్తి ఉందని చెప్పాడు. త్వరలో ఉన్ముక్త్ లక్ష్యం నెరవేరనుంది. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) తరఫున ఆడుతున్న ఉన్ముక్త్ చంద్.. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాపై ఆడనున్నాడు. జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో సెప్టెంబర్ 2021లో భారత క్రికెట్ నుంచి ఉన్ముక్త్ రిటైర్ అయిన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, యూఎస్‌ఏ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న జట్టుగా యూఎస్‌ఏ నేరుగా అర్హత పొందింది. జూన్ 12న న్యూయార్క్‌లో నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అమెరికాతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ అమెరికా తరఫున బరిలోకి దిగనున్నాడు. తాజాగా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్ముక్త్ చంద్ మాట్లాడుతూ టీమిండియాకు వ్యతిరేకంగా ఆడడం చాలా వింతగా ఉందని చెప్పాడు.
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. ఆలయాన్ని సందర్శించిన పాక్ క్రికెటర్!
‘టీమిండియాకు వ్యతిరేకంగా ఆడడం చాలా వింతగా ఉంటుంది. నేను భారత్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుండి.. నా లక్ష్యం ఒకటే. భారత జట్టుకు వ్యతిరేకంగా ఆడాలనుకుంటున్నా. ఎలా చెప్పడంలో ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై నన్ను నేను పరీక్షించుకోవాలి’ అని ఉన్ముక్త్ చంద్ చెప్పాడు. 2021లో భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉన్ముక్త్.. అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్‌తో మూడేళ్లపాటు ఒప్పందం చేసుకొన్నాడు. భారత జాతీయ జట్టులో అవకాశాల కోసం ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. అదే సమయంలో అమెరికా నుంచి లీగ్‌ల్లో ఆడేందుకు ఆఫర్ రావడంతో.. ఉన్ముక్త్ భారత క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకొన్నాడు.