USA: గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ భూ వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే ధృవాల వద్ద నీరు వేగంగా కరుగుతోంది. ఇదే కొనసాగితే రానున్న కొన్ని ఏళ్లలో సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంత పట్టణాలు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నగరాలు హై రిస్క్‌లో ఉన్నాయి. 2050 నాటికి అమెరికాలోని తీర ప్రాంత నగరాల్లో ప్రతీ 50 మందిలో ఒకరు గణనీయమైన…
China: డ్రాగన్ కంట్రీ చైనా రక్షణ బడ్జెట్‌ని పెంచింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, 2024 రక్షణ వ్యయాన్ని పెంచుతామని చైనా మంగళవారం ప్రకటించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) వార్షిక సమావేశ ప్రారంభంలో గత ఏడాది కన్నా 7.2 శాతం పెరుగుదలను ప్రకటించింది. 2024లో రక్షణ బడ్జెట్‌ని 1.665 ట్రిలియన్ యువాన్లు ($231.4 బిలియన్లు) ఖర్చు చేయనుంది.
Mother: అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుర్మార్గపు తల్లి తన సంతోషం చూసుకుంది. తనకు ఓ బిడ్డ ఉందని మరిచి విహారయాత్రలకు వెళ్లింది. 16 ఏళ్ల పసిబిడ్డను ఒంటరిగా ఇంట్లో వదిలి డెట్రాయిట్, ప్యూర్టో రికోకు వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లింది. 10 రోజుల పాటు ఇంట్లో చూసుకునే వారు లేకుండా బిడ్డ ఉండటంతో మరణించింది. నిందితురాలైన మహిళను ఓహియో రాష్ట్రానికి చెందిన క్రిస్టెల్ కాండెలారియోగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె హత్యానేర విచారణ ఎదుర్కొంటోంది. మహిళ 16…
S Jaishankar: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే, భారత్ మాత్రం రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంది. పలు సందర్భాల్లో యూరప్, అమెరికా నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ భారత్ ముడిచమురు కొనడం ఆపలేదు. పలు సందర్భాల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెస్ట్రన్ మీడియాకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. తాజాగా ఆయన మరోసారి అమెరికా ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఔరా అనిపించారు.
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. న్యూయార్క్ కోర్టు జడ్జి ఆర్థర్ అంగోరాన్ ట్రంప్, అతని కంపెనీలను మోసం చేసిన కేసులో సుమారు 355 మిలియన్ డాలర్లు అంటే రూ. 3వేల కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
Bubonic Plague: 14వ శతాబ్ధంలో ప్రపంచాన్ని భయపెట్టిన, దాదాపుగా ఐరోపాలో 10 లక్షల మంది ప్రాణాలను తీసుకున్న ‘‘బుబోనిక్ ప్లేగు’’ అమెరికాలో గుర్తించారు. యూఎస్ ఓరేగాన్లో ఓ వ్యక్తిలో ఈ వ్యాధిని గుర్తించారు. డెస్చుట్స్ కౌంటీలో రోగికి పెంపుడు పిల్లి ద్వారా ఈ వ్యాధి సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పిల్లికి, రోగికి మధ్య కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించామని, అనారోగ్యాన్ని నివారించడానికి మెడికేషన్ ఇచ్చామని ఆ ప్రాంత ఆరోగ్య అధికారి డాక్టర్ రిచర్డ్ ఫాసెట్ ఒక ప్రకటనలో చెప్పారు.
California: అమెరికా కాలిఫోర్నియాలో దారుణం చోటు చేసుకుంది. భారతీయ దంపతులు, తమ ఇద్దరు పిల్లలతో కలిసి మరణించారు. 2 మిలియన్ డాలర్ల విలువైన ఇంటిలో విగతజీవులుగా కనిపించారు. మరణించిన వ్యక్తుల్ని ఆనంద్ సుజిత్ హెన్రీ, 42, అతని భార్య అలిస్ ప్రియాంక, 40, మరియు వారి 4 సంవత్సరాల కవల పిల్లలు నోహ్ మరియు నీతాన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనను హత్య-ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన వ్యక్తులపై తుపాకీ గాయాలు కనిపించాయి.
Tom Moody React on USA Pitches: టీ20 ప్రపంచకప్ 2024 ఉన్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రదర్శనలకు ఎంతో ప్రాధాన్యం ఉండబోతుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ అంటున్నారు. ఐపీఎల్ 2024లో పరుగులు చేయడం, వికెట్లు తీయడం టీ20 ప్రపంచకప్ సెలక్షన్లో పరిగణనలోకి రానున్నాయన్నారు. టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న అమెరికాలో ఆడడం చాలా మంది ఆటగాళ్లకు కొత్త అనుభవం కానుందని పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 మర్చి 23న ఆరంభం…
Nikki Haley: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇండో-అమెరికన్ నేత నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అమెరికాతో భాగస్వామిగా ఉండాలని అనుకుంటోందని అయితే, ప్రస్తుతం అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని భారత్ విశ్వసించడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోందని, ప్రస్తుతం ప్రపంచ పరిస్థితుల్లో భారత్ తెలివిగా ఆట ఆడుతోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని ఆమె అన్నారు.