Benjamin Netanyahu: చిరకాల మిత్రదేశాలైన ఇజ్రాయెల్- అమెరికా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. హమాస్ నియంత్రణలోని గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన సమయమంటూ చేసిన అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును ప్రతిపాదననూ ఇజ్రాయెల్ వ్యతిరేకించింది. నేరుగా, ఈ విషయాన్ని అమెరికాకు తెలియజేసినట్లు ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
Read Also: Trivikram: గురూజీకి ఈ హీరో కలిస్తే ఇంపాక్ట్ మాములుగా ఉండదు…
ఇక, మరోవైపు ఇజ్రాయెల్ తీరుపై అమెరికా కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. నెతన్యాహు ప్రకటనను తాము భిన్నాభిప్రాయంగా పరిగణిస్తున్నామని వైట్ హౌస్‌లోని జాతీయ భద్రతా విభాగం అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా వైపు అడుగులు పడే వరకు ఇజ్రాయెల్ భద్రతకు హామీ లభించదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సైతం పేర్కొన్నారు. రెండు దేశాల ఏర్పాటే ఈ సమస్యకు సరైన పరిష్కారమని బ్లింకైన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే, గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల తీవ్రతను తగ్గించడానికి ఇదే సరైన సమయం అని గత వారం శ్వేతసౌధం ఓ ఓ ప్రకటనలో ప్రకటించింది.
Read Also: Hyderabad Crime: అంబర్ పేటలో దారుణం.. పుట్టినరోజే పట్టాలపై..
అయితే, ఈ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నిన్న (గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. హమాస్ మిలిటెంట్లను అంతమొందించి బందీలను విడిపించే వరకు గాజాలో యుద్ధం ఆగదని వెల్లడించారు. సంపూర్ణ విజయం సాధించే వరకు వెనక్కి తగ్గేదే లేదు అని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్‌పై దాడులకు పాలస్తీనా కేంద్రంగా మారుతుందని బెంజమిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జోర్డాన్ నదికి పశ్చిమాన ఉన్న ప్రాంతం మొత్తంపై తమ నియంత్రణ ఉండాల్సిందేనని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.