Iran Blast : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ ఏవియేషన్ అండ్ స్పేస్ ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఇది జరిగింది. పేలుడు అనంతరం ప్రధాన కార్యాలయం నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్యాయ్‌ని గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టిన సంఘటన కలకలం రేపుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్‌లోని వైట్ హౌజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వైట్ హౌజ్ ముందు ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. తన కారుతో బైడెన్ కాన్వాయ్‌ని ఢీ కొట్టాడు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో…
Israel-Hamas: ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో అమెరికా ఇజ్రాయిల్ పక్షాన నిలబడింది. అయితే యూఎస్‌లో జరిగిన ఓ పోల్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యంగ్ అమెరికన్లు హమాస్‌కి మద్దతుగా నిలుస్తు్న్నట్లు తేలింది. చాలా మంది యువ అమెరికన్ పౌరులు ఇజ్రాయిల్ ఉనికి కోల్పోవాలని, గాజాను నియంత్రిస్తున్న హమాస్‌కే అప్పగించాలనే అభిప్రాయాలను వెల్లడించినట్లుగా పోల్‌లో తేలింది.
North Korea: నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా లేదా దాని మిత్ర రాజ్యాలపై అణుదాడి జరిగితే అది ఆమోదయోగ్యం కాదని, ఈ పరిణామాలు కిమ్ పాలనకు ముగింపు పలుకుతాయని అమెరికా-దక్షిణ కొరియా ఒక సంయుక్త ప్రకటనలో శనివారం తెలిపాయి.
Teacher illicit affair:మహిళా టీచర్లు అక్కడి మైనర్ విద్యార్థులతో సెక్స్ సంబంధాలు పెట్టుకోవడం అమెరికాలో పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో ఇలాంటి కేసుల్లో పిల్లల్ని దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరోకటి అమెరికాలో చోటు చేసుకుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. కొడుకు, తన మహిళా టీచర్‌తో కారులో శృంగారం చేస్తుండగా, అతని తల్లి రెడ్ హ్యాండెట్‌గా పట్టుకుంది. దీనికి ఓ మొబైల్ ట్రాకింగ్ యాప్ ఉపయోగించి కొడుకు…
Hamas War: హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తమ లక్ష్యాలు నెరవేరే దాకా యుద్ధాన్ని ఆపేది లేదని, ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల చెప్పారు. దానికి అనుగుణంగానే ఇజ్రాయిల, గాజస్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. దీంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు నిర్వహిస్తోంది.
Medical Miracle: వైద్యశాస్త్రంలోనే ఈ ఘటన అద్భుతమని చెప్పాలి. వైద్యపరంగా మరణించిన ఓ మహిళ, 24 నిమిషాల తర్వాత బతికింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన సదరు మహిళ తన అనుభవాలను పంచుకుంది. రచయిత్రి లారెన్ కెనడే గుండో కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించారు. దాదాపుగా అరగంట తర్వాత మళ్లీ ఆమెకు పునరుజ్జీవనం లభించింది.
Vivek Ramaswamy: వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరుపున ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తు్న్నారు. గురువారం సీఎన్ఎన్ టౌన్ హాల్లో వివేక్ రామస్వామిని ఒక ఓటర్ హిందూ విశ్వాసాల గురించి ప్రశ్నించింది. దీనికి రామస్వామి చెప్పిన జవాబు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల మేకర్, ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా వ్యాప్తంగా 20 లక్షల కార్లను రీకాల్ చేయనుంది. టెస్లా కార్లలోని ఆటోపైలట్ అధునాతన సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలో కొత్త సేఫ్గార్డ్ని ఇన్స్టాల్ చేసేందుకు, ఈ సిస్టమ్‌ని మిస్ యూస్ చేయకుండా రక్షణ తీసుకునేందుకు టెస్లా కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ 2.03 మిలియన్ మోడల్ S, X, 3 మరియు Y వాహనాలకు అప్డేట్ను విడుదల చేస్తుందని…
MRI Machine: అమెరికాలో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. జూన్ నెలలో ఒక మహిళ MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజినింగ్) మెషీన్‌లోకి లోడ్ చేసిన తుపాకీతో వెళ్లింది. ఈ పరిణామం ఆమె ప్రాణాలను మీదికి తెచ్చింది. లోడ్ చేయబడిన తుపాకీ పేలడంతో ఆమె వెనక భాగంలో గాయమైంది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం..57 ఏళ్ల మహిళ ఈ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించింది.