మగవాళ్లు ఆడవాళ్లను వేధించడం, వాళ్ల ఇళ్లల్లోంచి వెళ్లగొట్టడం లాంటి ఉదంతాలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ యూపీలోని అమ్రోహా జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్య భర్తను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ మహిళ యూపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్. తన భార్య తనను కొట్టిందని.. జైలుకు పంపుతానని బెదిరించిందని బాధితుడైన భర్త ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Bomb Threat For Taj Mahal: ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ బెదిరింపు మెయిల్‌ను పర్యాటక శాఖకు పంపారు. ఈ ముప్పుతో తాజ్ మహల్ చుట్టూ భద్రతను పెంచారు. మరోవైపు, తాజ్ మహల్ లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో తాజ్ మహల్ సెక్యూరిటీ పోలీసులు, ఇతరత్రా సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెయిల్…
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్‌లో రోడ్డుపై వెళ్తోంది. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. కొంత సేపు వాదించుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీ సమీప ప్రాంతంలో ఏడేళ్ల వయసులో కిడ్నాపైన బాలుడు.. 30 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. క్షేమంగా పోలీసులు ఇంటికి చేర్చారు. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు.
నిదానమే ప్రదానం అన్నారు పెద్దలు. ఎవడి దారిన వాడు పోతే ఇబ్బంది ఉండదు. అంతేకానీ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే.. ఎవడికైనా తిక్క రేగుతుంది. ఈ స్టోరీ చదివితే.. లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది.
యూపీలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని భోజ్‌పూర్ ఖెత్సీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో మరణించాడు. అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో.. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాబోయే భర్త మరణవార్త విన్న వధువు అపస్మారక స్థితికి చేరుకుంది.