NIA: నిషేధిత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైష్ ఏ మహ్మద్(జేఈఎం)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతుగా ప్రచారానికి పాల్పడుతున్నారని.. అస్సాం, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లోని 19 చోట్ల దాడులు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని బామ్జూ మట్టన్ ప్రాంతం, బారాముల్లాలోని క్రీరీ, బుద్గామ్‌లోని ఖాన్ సాహిబ్ ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బందాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలను కట్ చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ మహిళ పదునైన వస్తువుతో అతని ప్రైవేట్ భాగాలను కత్తిరించింది. ఆ వ్యక్తి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తనపై దాడికి యత్నించడంతో తాను ఈ దారుణానికి ఒడిగట్టానని మహిళ పేర్కొంది.
మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా దాదాపు 50 రోజుల పాటు కొనసాగుతుంది. మహాకుంభం ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా చెబుతారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. రాజ స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో చివరిసారిగా 2012లో మహా కుంభమేళా జరిగింది.
మగవాళ్లు ఆడవాళ్లను వేధించడం, వాళ్ల ఇళ్లల్లోంచి వెళ్లగొట్టడం లాంటి ఉదంతాలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ యూపీలోని అమ్రోహా జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్య భర్తను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ మహిళ యూపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్. తన భార్య తనను కొట్టిందని.. జైలుకు పంపుతానని బెదిరించిందని బాధితుడైన భర్త ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Bomb Threat For Taj Mahal: ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ బెదిరింపు మెయిల్‌ను పర్యాటక శాఖకు పంపారు. ఈ ముప్పుతో తాజ్ మహల్ చుట్టూ భద్రతను పెంచారు. మరోవైపు, తాజ్ మహల్ లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో తాజ్ మహల్ సెక్యూరిటీ పోలీసులు, ఇతరత్రా సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెయిల్…
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్‌లో రోడ్డుపై వెళ్తోంది. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. కొంత సేపు వాదించుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీ సమీప ప్రాంతంలో ఏడేళ్ల వయసులో కిడ్నాపైన బాలుడు.. 30 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. క్షేమంగా పోలీసులు ఇంటికి చేర్చారు. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు.