దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. యూపీ, బీహార్ నుంచి ఢిల్లీ వరకు భూమి కంపించింది. భూకంప కేంద్రం నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్‌లో దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సోమవారం ఉదయం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. దహను తాలూకాలో తెల్లవారుజామున 4.35 గంటలకు భూకంపం సంభవించిందని జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ వివేకానంద కదమ్ తెలిపారు.
READ MORE: Bharatpol: నేడు ‘భారత్‌పోల్’ పోర్టల్‌ను ప్రారంభించనున్న అమిత్ షా.. ఇక, నేరస్థులకు దబిడిదిబిడే
తాలూకాలోని బోర్డి, డాప్‌చారి, తలసరి ప్రాంతాల ప్రజలు తెల్లవారుజామున భూ ప్రకంపనలను అనుభవించారని వెల్లడించారు. ఉదయం 6.40 గంటల ప్రాంతంలో మోతీహరి, సమస్తిపూర్ సహా బీహార్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఐదు సెకన్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. భూకంప కేంద్రం నేపాల్‌లోని గోకర్ణేశ్వర్ వేదికగా నమోదైంది.