ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న భాగం కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న 35 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Aadhaar Mobile Number: మీ ఆధార్‌కి వేరొకరి ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా?.. చిక్కుల్లో పడినట్లే!
సుందరీకరణ పనుల్లో భాగంగా స్టేషన్‌లో నిర్మాణాలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండంతస్తుల భవన పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతుండగా హఠాత్తుగా కూలిపోయింది. శిథిలాల కింద 35 మంది చిక్కుకోగా.. 23 మంది కార్మికులను సహాయ బృందాలు సురక్షితంగా రక్షించాయి. మితగా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పైకప్పు నిర్మాణం జరుగుతుండగా షట్టరింగ్ కూలిపోయిందని జిల్లా మేజిస్ట్రేట్ శుభ్రాంత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పగాయాలైన వారికి రూ.5వేలు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఈశాన్య రైల్వే తెలిపింది. రెస్క్యూ పనిలో సహాయం చేయడానికి లక్నో నుంచి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్‌ను రప్పించారు.
VIDEO | Uttar Pradesh : An under-construction slab collapsed at Kannauj Railway Station. Further details are awaited.
(Full video available on PTI Videos: https://t.co/n147TvqRQz) pic.twitter.com/cXO5b0lIg9
— Press Trust of India (@PTI_News) January 11, 2025
#WATCH | Kannauj, Uttar Pradesh: Rescue operation with the help of a dog squad is underway after an under-construction lintel collapsed at Kannauj railway station
As per state minister Asim Arun, 23 people have been rescued, 20 people received minor injuries and are undergoing… pic.twitter.com/LZ1SxZU8lb
— ANI (@ANI) January 11, 2025