US-Iran: దుబాయ్‌పై ఇరాన్ మళ్లీ దాడులు.. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు
- దుబాయ్‌పై ఇరాన్ మళ్లీ దాడులు
- అమెరికా ఎంబసీలో భారీగా మంటలు
- ఎవరికీ గాయాలు కాలేదని అమెరికా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అమెరికా కార్యాలయాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది. దీంతో రాయబార కార్యాలయంలో భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య దగ్గర నుంచి ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోతుంది. ఆది, సోమ, మంగళవారం వరుస దాడులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాలనే ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. కువైట్, రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
డ్రోన్, క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తోంది. దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి చేయడంతో అగ్నిప్రమాదం జరిగింది. కానీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. రాయబార కార్యాలయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ధృవీకరించారు.
మంగళవారం తెల్లవారుజామున రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ రెండు డ్రోన్లు దాడి చేయడంతో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రజలెవరూ రాయబార కార్యాలయాలకు రావొద్దని సూచించింది. భారీగా మంటలు వ్యాపించాయని.. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వాటిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది.
#Watch | A drone attack near the US Consulate in Dubai caused a fire late Tuesday as Iran continued its drone and missile attacks targeting American diplomatic missions in the Middle East. This follows attacks on the US Embassy in Kuwait and Riyadh on Monday and Tuesday pic.twitter.com/Ox4SJkG9Q3
— NDTV (@ndtv) March 4, 2026
Photos: The fire near the US Consulate in Dubai has been fully extinguished, with no injuries reported. Dubai authorities reaffirm their commitment to ensuring everyone's safety and security. pic.twitter.com/OPAOQRHEIG
— Dubai Media Office (@DXBMediaOffice) March 3, 2026
తాజావార్తలు
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!