UP : యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో, గ్రామస్థులు తమ పొలాలను దున్నుతుండగా చాలా ఏళ్ల నాటి ఆయుధాలు దొరికాయి. సమాచారం ప్రకారం.. ఈ ఆయుధాలన్నీ 18వ శతాబ్దానికి చెందినవి.
UP: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌కి ఖరీదైన గిఫ్ట్స్ కొనివ్వడానికి ఓ యువకుడు బ్యాంక్‌కే కన్నం వేశాడు. ప్లాన్ విఫలమవ్వడంతో పోలీసులకు చిక్కాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరాబంకిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన కెనడాలోని ఓ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించిన అబ్దుల్ సమద్ ఖాన్ అలియాస్ షాహిద్ ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు.
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చిందని, ఇందుకు అయోధ్ నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Shocking: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కొడుకు తన స్నేహితులతో కలిసి తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఇటీవల మహిళ మృతదేహం లభించింది. దీనిపై విచారించిన పోలీసులు.. సొంత కొడుకే హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. డీజే మిక్సర్ రిపేర్ కోసం డబ్బులు అడిగితే, తల్లి నిరాకరించడంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. కొడుకు, అతడి ఫ్రెండ్స్‌ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ప్రస్తుతం నెటిజన్లు రీల్స్ వ్యసనంగా మారారు. దీంతో రీల్స్ క్రియేట్ చేసే వాళ్లు కంటెంట్ కోసం చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా వైరల్ అవుతున్న ఈ వీడియోలో యువకులు డిఫరెంట్ గా ఆలోచించి రీల్ రూపొందించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వింత కేసు వెలుగు చూసింది. మహిళా పోలీస్ స్టేషన్లో నడుస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని విని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆర్జే శంకర్ కంటి ఆస్పత్రిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు.
CM Yogi: ఇటీవల కాలంలో ఆహారంలో ఉమ్మివేయడం, జ్యూస్‌లో మూత్రం కలపడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కస్టమర్లని ఇలాంటి ఘటనలతో మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, వీటిపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీ గవర్నమెంట్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
విజయదశమి సందర్భంగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని రామలీలాలో గ్రౌండ్లో నాటక ప్రదర్శన నడుస్తోంది. ఆసక్తిగా సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా నటులు భౌతికదాడులకు దిగారు. దీంతో ప్రేక్షకులు వెళ్లి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మొసలి నివాసల దగ్గర హల్చల్ చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం దాన్ని తాళ్లతో బంధించి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.