ఉత్తరప్రదేశ్ పోలీసులు.. నేరగాళ్ల అంతుచూశారు. దుండగుల భరతం పట్టారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు క్రిమినల్స్ హతమయ్యారు. ఈ ఘటనలో ఒక పోలీస్ గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు పవిత్ర స్నానాలు చేశారు.
ఆటో డ్రైవర్లకు-ప్యాసింజర్ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడం చూస్తుంటాం. ఆటో ఎక్కించుకున్నాక.. మధ్యలో దింపేయడం.. లేదంటే డబ్బుల విషయంలో ఘర్షణ తలెత్తడం జరుగుతుంటాయి.
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లోని నిర్మాణంలో ఉన్న భాగం కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న 35 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
షాపింగ్ మాల్ అంటే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. పైగా మాల్లోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ, సిబ్బంది ఎప్పుడూ ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపిస్తారు.
Crime: కలకాలం భార్యని కాపాడాల్సిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. యూపీలో బులంద్షహర్లో ఒక వ్యక్తి తన భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ చర్యను వారు వీడియో రికార్డ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదైంది. భర్త తన స్నేహితులకు తనపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. గత మూడు సంవత్సరాలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా చెప్పింది. తాను గర్భవతినని, తన భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని వెల్లడించింది. Read Also: Telangana: “భూభారతి”కి గవర్నర్…
దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. యూపీ, బీహార్ నుంచి ఢిల్లీ వరకు భూమి కంపించింది. భూకంప కేంద్రం నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్లో దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సోమవారం ఉదయం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. దహను తాలూకాలో తెల్లవారుజామున 4.35 గంటలకు భూకంపం సంభవించిందని జిల్లా డిజాస్టర్…
ఉత్తరప్రదేశ్లో ఆరేళ్ల క్రితం మత ఘర్షణలో హత్యకు గురైన చందన్ గుప్తా కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 28 నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది.
Online Love: ఉత్తర్ ప్రదేశ్కి చెందిన ఓ వ్యక్తి తన ప్రేయురాలిని కలిసేందుకు భారత్-పాక్ సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి వెళ్లి అరెస్ట్ అయ్యాడు. యూపీ అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్కి చెందిన మహిళతో స్నేహం ఏర్పడింది.