ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కోర్టు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్‌లో జై పాలస్తీనా అనే నినాదానికి చెందిన అంశంపై 2025 జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఒవైసీ ప్రకటనపై న్యాయవాది వీరేంద్ర గుప్తా కోర్టులో దావా వేశారు. తాజాగా కోర్టు సెషన్స్ జడ్జి క్రిమినల్ సర్వైలెన్స్ మీర్గంజ్ నోటీసు జారీ చేశారు. ఒవైసీ రాజ్యాంగ, చట్టపరమైన సూత్రాలను ఉల్లంఘించారని కోర్టులో దాఖలైన దావాలో వీరేంద్ర గుప్తా ఆరోపించారు. ఈ నినాదం చట్టపరమైన సూత్రాలకు వ్యతిరేకమన్నారు.
READ MORE: Health: వెల్లుల్లిని ఆహారంలో కాకుండా ఇలా తినండి.. రోగాలకు చెక్ పెట్టండి
అసలేం జరిగింది?
కాగా.. ఇటీవల లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో హైదరాబాద్ ఎంపీ చేసిన నినాదాలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ ఆయన నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఎంపీగా ఒవైసీపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి ఫిర్యాదులు అందాయి. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. పరాయి దేశానికి విధేయత చూపించినందుకు ఒవైసీని అనర్హుడి ప్రకటించవచ్చని సూచించారు. ఇదిలా ఉండగా.. ఒవైసీ తన చర్యను సమర్థించుకున్నారు. ఇలా అనడంతో తప్పులేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇలా నినాదాలు చేయొద్దనే నిబంధనలు లేవని చెప్పారు. పాలస్తీనా గురించి మహాత్మా గాంధీ ఏం చెప్పారో చదవండి అంటూ సూచించారు.
READ MORE:CM Chandrababu: పింఛన్ల తొలగింపుపై సీఎం కీలక వ్యాఖ్యలు..
మరోవైపు కాంగ్రెస్ నేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీకి కూడా బరేలీ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది. ఆర్థిక సర్వేకు సంబంధించి రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రకటనపై హిందుత్వ నేత పంకజ్ పాఠక్ కోర్టులో దావా వేశారు. దీనిపై ఇప్పుడు కోర్టు రాహుల్‌కి నోటీసు జారీ చేసి హాజరుకావాలని ఆదేశించింది. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా హిందూ సమాజంలో భయానక వాతావరణం సృష్టించారని కోర్టులో దాఖలైన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టి హిందువుల ఆస్తులను లాక్కోవడానికి రాహుల్ ఇలాంటి ప్రకటన చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడి ప్రకటన తనను తీవ్రంగా బాధించిందని, అందుకే కోర్టులో దావా వేసినట్లు చెప్పారు.