ఆటో డ్రైవర్లకు-ప్యాసింజర్ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడం చూస్తుంటాం. ఆటో ఎక్కించుకున్నాక.. మధ్యలో దింపేయడం.. లేదంటే డబ్బుల విషయంలో ఘర్షణ తలెత్తడం జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరికీ అనుభవం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో ఆటో డ్రైవర్‌ను ఓ యువతి చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏమైంది? ఈ గొడవకు కారణమేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: IND Vs IRE: స్మృతి మంధాన బాదుడే బాదుడు.. భారత వన్డే చరిత్రలో రికార్డు స్కోరు!
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఓ ఆటో డ్రైవర్‌తో యువతి గొడవకు దిగింది. ఛార్జీల విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ప్రియాంషి పాండే అనే యువతి.. ఆటో డ్రైవర్ విమలేష్ కుమార్ శుక్లాను దుర్భాషలాడుతూ దాడి చేసింది. తనను కొట్టొద్దంటూ వేడుకున్నా వదిలిపెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను యువతి పాండే సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఆటో డ్రైవర్.. పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలంటూ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీడియో ద్వారా తన పరువు తీశారని.. దీన్ని చాలా అవమానంగా భావిస్తున్నట్లు డ్రైవర్ వాపోయాడు. తనకు గాయాలు కూడా అయినట్లుగా చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్జాపూర్ పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Ramesh Bidhuri: ‘‘జింక’’లా తిరుగుతోంది.. సీఎం అతిషీపై మరోసారి రమేష్ బిధురి కామెంట్స్..
అయితే డబ్బుల విషయంలో ఆటో డ్రైవర్ బూతులు తిట్టడంతోనే దాడి చేసినట్లుగా యువతి ఆరోపించింది. అంతేకాకుండా అతడు బెదిరించినట్లుగా తెలిపింది. ఆమె తన స్నేహితులతో ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె దాడి చేసిన దృశ్యాలను ఫ్రెండ్స్ మొబైల్‌లో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.
मिर्जापुर-किराया मांगने पर लड़की ने ऑटो चालक को पीटा, गाली गलौज देते हुए ऑटो चालक की जमकर पिटाई, ऑटो चालक हाथ जोड़ कर माफी मांगता रहा
लड़की ने मारपीट का वीडियो भी खुद वायरल किया, पुलिस ने बिना तहरीर के कार्रवाई से किया इनकार, सोशल मीडिया पर वायरल वीडियो#Mirzapur… pic.twitter.com/7BXMN29zVz
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) January 14, 2025