UP: ఓ షాపింగ్ మాల్‌లో కోతి హల్‌చల్.. కస్టమర్లకు చుక్కలు చూపించిన మంకీ
- ఉత్తరప్రదేశ్ ఝాన్సీ షాపింగ్ మాల్‌లో కోతి హల్‌చల్
- కస్టమర్లకు చుక్కలు చూపించిన మంకీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షాపింగ్ మాల్ అంటే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. పైగా మాల్‌లోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ, సిబ్బంది ఎప్పుడూ ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపిస్తారు. అలాంటిది ఓ కోతి షాపింగ్ మాల్‌లోకి ఎలా ప్రవేశించిందో.. ఏమో తెలియదు గానీ నానా హంగామా సృష్టించింది. కస్టమర్లకు చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని సిటీ కార్ట్ మాల్‌లోకి అనూహ్యంగా ఓ కోతి ప్రవేశించింది. ఒకరి పైనుంచి ఇంకొకరిపైకి దూకుతూ హడలెత్తించింది. ఒక మహిళ తలపైకి ఎక్కి భయాందోళనకు గురిచేసింది. ఎక్కడికెళ్లినా వెంటాడుతూ ఉండేది. జుట్టు పీకడమే కాకుండా.. కరవబోయింది. ఆమె షూ లాక్కుంది. ఈ పరిణామాలతో భయాందోళనకు గురై రక్షించాలంటూ కేకలు వేసింది. సహాయం చేయాలంటూ అరిచింది. ఆమె నుంచి దూరం చేసేందుకు సహచరులు అరటిపండ్లు తినిపిస్తూ డైవర్ట్ చేశారు. అలాగే దుప్పట్లు విసిరి కాపాడే ప్రయత్నం చేశారు. మొత్తానికి యువతి తప్పించుకుని పారిపోయింది. ఇలా మాల్‌లో అల్లకల్లోలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొనుగోలుదారులు వీడియో రికార్డ్ చేశారు. అయితే ఈ ఘటనపై మాల్ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. మంకీ లోపలికి ఎలా వచ్చింది.. కస్టమర్ల కలిగిన అసౌకర్యంపై ఎవరూ స్పందించకపోవడం విశేషం. మంకీ విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
झांसी के मॉल में बंदर ने मचाया उत्पात…
एक युवती को जमकर किया परेशान
चीखती नजर आई युवती,वीडियो हुआ वायरल#Jhansi #UPNews #ViralVideo pic.twitter.com/efQRvkLDTu
— News1India (@News1IndiaTweet) January 11, 2025
తాజావార్తలు
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!