కాన్పూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చదువులో టాప్‌లో ఉన్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కుమారుడు విగతజీవిగా ఉండడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
భారత్ ఉగ్రవాదులను ఏరివేస్తు్న్నప్పటికీ ఉగ్రదాడులకు అడ్డుకట్ట పడడం లేదు. ఉగ్రమూకలు ఆత్హాహుతి దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉగ్రదాడుల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చింది. భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉంచడానికి, యోగి ప్రభుత్వం కొత్త ప్రోటోకాల్‌ను అమలు చేసింది. ఈ ప్రోటోకాల్ ప్రకారం, రాష్ట్రంలోని మదర్సాలలో అభ్యసించే విద్యార్థులు, మౌలానాల పూర్తి వివరాలను ఉగ్రవాద నిరోధక దళం (ATS)కి సమర్పించాల్సి ఉంటుంది. దేశ…
దేశంలో మరో 4 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వారణాసిలో ప్రధాని మోడీ జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. విద్యార్థి కడుపు కోసి.. వేళ్లు నరికివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Road Accident: క్యాన్సర్‌తో బాధపడుతున్న కొడుకును బతికించుకోడానికి ఊరు కాని ఊరు వెళ్లాడు ఓ తండ్రి.. కానీ, రోడ్డు ప్రమాదంలో.. అది కూడా తండ్రి కళ్ల ఎదుటే.. ఆ కొడుకు కన్నుమూయడంతో ఆయన బాధను వర్ణించడం సాధ్యం కావడం లేదు.. క్యాన్సర్‌నుంచి కొడుకుని రక్షించుకోడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఆ తండ్రి ఆవేదనను ఆ దేవుడు కూడా ఆలకించలేదు. రోడ్డు ప్రమాదరూపంలో కళ్ల ముందే కొడుకును మరణించడంతో ఆ తండ్రి వేదన చెప్పనలవి కాకుండా ఉంది. Read…
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను సస్పెండ్ చేశారని ఆ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా రాసుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఫరూఖాబాద్‌లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రైవేట్ విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఇందులో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఓ అన్న చెల్లెలికి మరణశాసనం రాశాడు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థినికి చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. చదువుకోకుండా ప్రేమ వ్యవహారం నడిపించడంతో సోదరుడు జీర్ణించుకోలేక చెరువులో ముంచి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
పెళ్లై.. భర్త పిల్లలున్న కొందరు మహిళలు పరాయి వ్యక్తుల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు ఏర్పర్చుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త పిల్లలను చంపేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఓ మహిళ మూడో వివాహానికి రెడీ అయ్యింది. హలో బేబీ నేను నిన్ను మూడో పెళ్లి చేసుకుంటాను అని ప్రియుడితో ఫోన్ లో మాట్లాడింది. ఆ మాటలు విన్న…