United Nations: రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు సంస్థలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ఎఫెక్ట్, తాజాగా ఐక్యరాజ్యసమితి పైనా పడింది. పలు సంక్షోభ ప్రాంతాల్లో ఉన్న తమ శాంతి పరిరక్షకులను కుదించి తిరిగి వెనక్కి రప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Pakistan: శుక్రవారం రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై విషం వెళ్లగక్కాడు. ఐక్యరాజ్యసమితి వేదికగా అన్ని అబద్ధాలనే ప్రచారం చేశాడు. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంపై తామే గెలిచామంటూ, భారతదేశాన్ని శత్రువుగా అభివర్ణించాడు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడిపై నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు కోసం తాను విజ్ఞప్తి చేశానని, కానీ భారతదేశం ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఈ విషాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించాడు.
ట్రంప్.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ఈ హోదాలో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పక్కా నిఘా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి భద్రత కలిగిన ట్రంప్‌కు ఐక్యరాజ్యసమితిలో మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
Rajnath Singh: ఇటీవల సంవత్సరాల్లో ఐక్యరాజ్యసమితి అనేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాకిస్తాన్‌ను ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు వైస్-చైర్‌గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఈ ప్యానెల్ ఏర్పడింది.
Pakistan: ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో టెర్రర్ నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాను కట్టబెట్టడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇస్లామాబాద్‌కు తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను అప్పగించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ తీరును భారత్ ఎండగట్టింది. ఉగ్రవాద దాడుల్లో 20,000 మంది భారతీయులు మరణించారని భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు గుప్పించింది.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
UN-India: పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబా (LeT) తో పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చే దిశగా భారత్ తన కృషిని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం బుధవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక కార్యాలయం (UNOCT), కౌంటర్-టెరరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ (CTED) అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించింది. Read Also: Bob Blackman: పీవోకే ఉగ్ర శిబిరాలు నేలమట్టం…
భారత్- పాక్ దేశాల మధ్య సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు కీలక సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఈ మీటింగ్ లో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన తమ వాదనలు తెలియజేయనున్నారు.