Pakistan: పాక్‌కు ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్ హోదా.. సభ్య దేశాలు అభ్యంతరం..
- ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పాకిస్తాన్..
- పాక్‌కు ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్ హోదా ఇచ్చిన యూఎన్‌ఎస్‌సీ..
- ఉగ్రవాద ఆంక్షల కమిటీ పగ్గాలను పాక్ దక్కించుకోవడంతో సభ్య దేశాలు అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో టెర్రర్ నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాను కట్టబెట్టడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇస్లామాబాద్‌కు తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను అప్పగించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, భద్రతా మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కౌన్సిల్‌లోని మిగిలిన సభ్యులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జనవరిలో జరగాల్సిన ఐక్యరాజ్య సమితి కమిటీల కేటాయింపు ప్రక్రియ కేవలం పాకిస్తాన్ డిమాండ్లపై ఏకాభిప్రాయం లేకపోవడంతోనే గత ఐదు నెలలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
Read Also: Mini Countryman Electric JCW: మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 462KM రేంజ్
Also Read
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
కాగా, పాకిస్తాన్ మంకుపట్టు, అహేతుక డిమాండ్లపై భద్రతా మండలిలోని ఇతర సభ్యులు విసిగి పోయారని యూఎన్ అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో ఉగ్రవాదంపై భారత్‌ను లక్ష్యంగా చేసే పాక్ ప్రయత్నాలకు ఇతర సభ్యులు సపోర్టు పలికేందుకు రెడీగా లేనట్లు సమాచారం. యూఎన్‌ఎస్‌సీ శాశ్వత సభ్యులు చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా ఏ కమిటీకీ కూడా నాయకత్వం వహించడానికి ఇష్టపడలేదు.. ఎందుకంటే ఆ దేశాలకు హోదాలతో పని లేదని పేర్కొన్నారు. ఈ దేశాలన్నీ ఏకాభిప్రాయంతో పని చేస్తాయని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, పాక్‌కు కేటాయించిన స్థానం అంత ముఖ్యమైనది కాదు.. కేవలం నామమాత్రం అయిందేనన్నారు. కానీ, ఉగ్రవాద ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం వల్ల ఇస్లామాబాద్, కాబుల్ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
Read Also: Akhanda 2 : ‘అఖండ2’ టీజర్‌కు టైమ్ టూ డేట్ ఫిక్స్..
ఇక, తొలుత భద్రతా మండలిలోని ఆంక్షల కమిటీ, (నాన్-ప్రొలిఫరేషన్) ఆంక్షల కమిటీ, తాలిబాన్ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీల అధ్యక్ష పదవులను పాకిస్తాన్ డిమాండ్ చేయగా.. యూఎన్‌ఎసీ ఆ దేశానికి తాలిబాన్ కమిటీతో పాటు ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాలను మాత్రమే కట్టబెట్టింది. పాక్ ఉగ్రవాదానికి అడ్డా అనేది అందరికి తెలిసిన విషయం.. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐరాస భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చగా.. అందులో 146 మంది పాకిస్తానీయులే ఉన్నారు. 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ లాంటి ఎంతో మంది టెర్రరిస్టులు పాకిస్తాన్ లోనే ఆశ్రయం పొందుతున్నారు.
తాజావార్తలు
-
iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
-
iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!