ఉత్సాహం ఉండాలి, కానీ అత్యుత్సాహం ఉండకూడదు. ఏం కాదులే అని ఆ అత్యుత్సాహాన్ని ఎక్కడిపడితే అక్కడ ప్రదర్శిస్తే మాత్రం.. బాక్స్ బద్దలవ్వడం ఖాయం! ఇప్పుడు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోయ్ విషయంలోనూ అదే జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారతదేశానికి సలహా ఇవ్వబోయి, గట్టి ఎదురుదెబ్బని ఎదుర్కొన్నాయన! దీంతో, మరో దారి లేక ఆయన వెంటనే వెనకడుగు వేయాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ…
ఐక్యరాజ్యసమితి వద్దన్నా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోంది రష్యా. ఈ నేపథ్యంలో రష్యాపై చర్యలకు దిగింది ఐక్యరాజ్యసమితి. రష్యాకు గురువారం మరో గట్టి షాక్ తగిలింది. ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలి (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నుంచి రష్యాను బహిష్కరించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగింది. జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్ లో సభ్య దేశాల ఓటింగ్ మెజారిటీకి అనుగుణంగా రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బయటకు పంపారు.…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల విద్యార్ధులు, పౌరులు నానా యాతన అనుభవిస్తున్నారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా యుద్ధ ప్రాతిపదికన వేలాదిమందిని భారత్ స్వదేశాలకు తరలించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని సుమీ లో చిక్కుకుపోయున భారతీయ విద్యార్థుల తరలింపు సాధ్యంకాలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెప్పింది భారత్. ఇప్పటికి 20 వేల మంది భారతీయులను, భారత్ ను కోరిన ఇతర దేశస్థులను కూడా తరలించామని యు.ఎన్…
ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు ప్లాన్ చేస్తుండగా.. మరోవైపు.. పంజ్‌షీర్‌లో తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది… అయితే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తానే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ కూడా ఆఫ్ఘన్‌ను వీడారు.. అధ్యక్షుడు లేని సమయంలో నిబంధనల ప్రకారం తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకుని పంజ్‌షీర్ వెళ్లిన ఆయన.. తాలిబన్లపై పోరాటానికి పంజ్‌షీర్ ప్రజలు, అక్కడి ప్రజలు, ఆప్ఘన్ సైన్యం…
ఆఫ్ఘనిస్థాన్‌లో సంక్షోభంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, రక్షణ విమానాల కార్యకలాపాలు కొనసాగుతాయని నాటో అధికారులు ప్రకటించారు. మరోవైపు… ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జన్సన్ స్పందించారు. అక్కడి సంక్షోభంపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. తాలిబాన్ల…