పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
READ MORE: Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్‌బాబుపై కేసు కొట్టివేత.. “ఇది రైతుల విజయం, ప్రజల గెలుపు”
కాంగ్రెస్ ఇచ్చిన లిస్టులో శశిథరూర్ లేకపోయినా.. ఆయనను కేంద్రం ఎంపిక చేసింది. సుప్రియా సూలే మూడో బృందాన్ని లీడ్ చేయనున్నారు. విదేశాలకు వెళ్లే ఏడు బృందాలకు.. ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్(బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్ శిందే (శివసేన) నాయకత్వం వహించనున్నారు. మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. పాక్ నిజరూపాన్ని వాటి ఎదుట ఎలా ఆవిష్కరించాలో ముందుగానే ఎంపీలకు కేంద్రం వివరించనుంది.
READ MORE: Anchor Shyamala: ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం!
ప్రపంచ దేశాలకు భారత్ బృందాలు ఏం చెబుతాయి?
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమయ్యేలా పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యల గురించి ఈ బృందాలు వివరిస్తాయి. పాక్ చర్యలకు దీటుగా ఆపరేషన్ సిందూర్‌ను ఎలా చేపట్టిందో చెప్తారు. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇస్తారు. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదనే అంశాన్ని నొక్కిచెప్పనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నోఏళ్లుగా పాకిస్థాన్ అనుసరిస్తున్న పాత్ర, దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరిస్తారు.