కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్…
Fraud : తెలంగాణలో నిరుద్యోగుల ఆశలను తమ లాభాలకు మార్గంగా మలుచుకునే మోసగాళ్ల చతురత రోజురోజుకీ పెరుగుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్పిస్తామని, ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వివిధ రూపాల్లో మోసాలు చేస్తున్నారు. అయితే ఈ సారి పురుషులే కాదు, ఓ మహిళ కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తాను హైకోర్టు జడ్జినని చెప్పి నిరుద్యోగుల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రసన్నా రెడ్డి అనే…
మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి సమాచారం అందించారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. క్లైమోర్ మైన్స్ కే భయ పడలేదు.. కామెడీ పీస్ కు భయపడతామా? అన్నారు..
దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్లలో నిరుద్యోగాన్ని అంతం చేస్తానని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేజ్రీవాల్ ఓటర్లను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు.
Group 3 Preliminary Key: నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా దూసుకెళ్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల గ్రూప్స్ కు సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 1, 2, 3 పరీక్షలను పూర్తి చేసింది టీజీపీఎస్సీ. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది టీజీపీఎస్సీ. గతేడాది నవంబర్…
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రకటించిన విధంగా సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ “అభయ హస్తం” పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర…
కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్‌ను ప్రజలకు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఉచిత రేషన్‌కు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీసింది.
ఉమ్మడి నల్గొండ జిల్లా సాగు నీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏడాదికి కిలోమీటరు సొరంగం తవ్వినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి అయ్యేదన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించామని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి విన్నామని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ అనుకూలత గురించి వింటున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అవసరం ఉందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.