వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలిపించాల్సిన అవసరం ఉంది అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క ఎకరాకైనా అదనంగా సాగు నీరు అందించారా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలు, దీక్షలకు పిలుపునిచ్చింది. పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యం వంటి తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది.
టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ తలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది. మహాధర్నాకు పోలీస్ లు అనుమతి ఇవ్వక పోవడంతో బీజేపీ కోర్ట్ నుండి అనుమతి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించేందుకు అనుమతి లభించింది.
నిరుద్యోగంపై కేంద్రంలో, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశంలో నిరుద్యోగం కారణంగా పెళ్లి వయసులో ఉన్న యువకులకు వధువులు దొరకడం లేదని ఆయన బుధవారం అన్నారు.
Pakistan unemployment: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర నిరుద్యోగం నెలకొంది. ఎంతలా అంటే సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షను క్లాస్ రూముల్లో నిర్వహిస్తారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం కానిస్టేబుల్ రాత పరీక్షను ఏకంగా ఓ స్టేడియంలో నిర్వహించాల్సి వచ్చింది. అంటే అంతలా అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది. ఇస్లామాబాద్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 1,667 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శనివారం ఇస్లామాబాద్ లో రాత పరీక్ష జరిగింది. దీంతో రిక్రూట్మెంట్ పరీక్షను ఇస్లామాబాద్ స్పోర్ట్స్…
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్…
నిరుద్యోగిత రేటు మరింతపైకి కదిలింది.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన నివేదిక నిరుద్యోగిత పెరిగినట్టు స్పష్టం చేసింది.. ఈ ఏడాది మార్చిలో 7.60 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు.. తర్వాత నెలలలో మరింత పైకి కదిలి.. ఏప్రిల్‌లో 7.83 శాతంగా నమోదైంది. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పరిశీలిస్తే మాత్రం భిన్నంగా ఉంది.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మార్చి నెలలో 8.28 శాతం ఉంటే.. ఏప్రిల్ నెలలో అది…