Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రకటించిన విధంగా సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ “అభయ హస్తం” పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్ శాంతికుమారి, మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు.
Also Read: Nara Lokesh: నా ఉద్యోగం తీయించేలా ఉన్నావే.. విద్యార్థితో లోకేశ్ ఛలోక్తి!
ఇక ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొన్ని కీలక నిర్ణయాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏడాదిలో 55,143 ఉద్యోగాలు అందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చామని, దేశంలో ఎవరూ ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు 14 ఏళ్ల తర్వాత మేమే చేపట్టామని.. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వీటి కోసం పెద్దగా ప్రయత్నాలు చేసినవారు లేరని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 నియామకాలపై తీవ్రంగా స్పందించారు. ఎంతోమంది లీగల్ లిటిగేషన్లకు వెళ్లారు. కానీ.. హైకోర్టు, సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయని తెలిపారు. మార్చిలో కొత్త నియామకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వివరించారు. మా ప్రభుత్వం ప్రతి దశలో నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే ప్రయత్నం చేస్తోందని, యువత కూడా మా ప్రయత్నాన్ని గమనించాలని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకారం జరుగుతుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల భద్రత విషయంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల ప్రమాద భీమాకు కోటి రూపాయల నుంచి 1.25 కోట్లు పెంచామని, బ్యాంకర్లతో సింగరేణి ఒప్పందం కూడా చేపట్టామని తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న డిప్యూటీ సీఎం
ఇక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సివిల్స్ లో మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది 20 మంది విద్యార్థులు సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్లిన విషయం గర్వంగా ఉందని అన్నారు. వారు సెలక్ట్ అయితే మరింత సంతోషం అని తెలిపారు. అలాగే భట్టి విక్రమార్క సింగరేణి పాలనపై కూడా మాట్లాడారు. సింగరేణిని రాజకీయాలకోసం వాడుకోమని, సింగరేణిని ప్రపంచంలో అగ్రగామి సంస్థగా నిలబెడతాం అని స్పష్టం చేశారు.