దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్లలో నిరుద్యోగాన్ని అంతం చేస్తానని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేజ్రీవాల్ ఓటర్లను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. ఆప్ ప్రభుత్వం సాధించిన రికార్డులను కేజ్రీవాల్ గుర్తుచేశారు. పంజాబ్‌లో రెండేళ్లలోపు 48,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించినట్లు గుర్తుచేశారు. అలాగే యువతకు మూడు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Venkatesh: హీరోల రెమ్యునరేషన్ పై వెంకటష్ షాకింగ్ కామెంట్స్
యువతకు ఉపాధి కల్పించడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యమని తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే తమ బృందం ఓ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం రెండేళ్లలో 48 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. అలాగే మూడు లక్షల ప్రైవేటు ఉద్యోగాలను కల్పించినట్లు వివరించారు. యువతకు ఉపాధి ఎలా కల్పించాలో ఆప్‌కు బాగా తెలుసు అన్నారు. ప్రజల మద్దతుతో ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Buddha Venkanna: టీడీపీకి దశ, దిశ లోకేష్ మాత్రమే.. చంద్రబాబు తర్వాత ఆయనే సీఎం..
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తోంది. ఇలా రెండు పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. ఇప్పటికే రెండు పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించాయి.
ఇది కూడా చదవండి: AP Cabinet: వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం..
#WATCH | AAP National Convenor Arvind Kejriwal says, "In the next 5 years, our top priority will be to eliminate unemployment in Delhi…My team is preparing a plan on how to generate employment opportunities…"
(Video source: AAP) pic.twitter.com/XGCkfRxTaL
— ANI (@ANI) January 23, 2025