Bhatti Vikramarka : రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అవసరం ఉందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. బాగా వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి చేసి స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావించారని, భూమి కోల్పోతున్నప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. వారి భాద ప్రభుత్వం కు తెలుసు అని ఆయన అన్నారు. బాధితులకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు భట్టి విక్రమార్క.
Chennai: తల్లిపై మమకారం.. వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌పై కొడుకు దాడి
బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులపై కుట్ర ప్రకారం కొద్ది మంది అరాచక శక్తులను అక్కడ పెట్టారని, అమాయక గిరిజన ప్రజలను రెచ్చగొట్టారన్నారు భట్టి విక్రమార్క. భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేసేందుకు అనేక ఫోరంలు ఉన్నాయన్నారు. అత్యంత ప్రజాస్వామ్య యుతముగా స్వేచ్ఛగా తమ సమస్యలు చెప్పుకోవచని ప్రభుత్వం తలుపులు తెరిచి పెట్టిందని, దుర్మార్గపు ఆలోచనతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో మేము భాదితుల పక్షాన ప్రజాస్వామ్యం బద్దంగా ప్రశ్నించామన్నారు భట్టి విక్రమార్క.
Ponguleti Srinivas Reddy : ఎంఎస్పీ రేటు కంటే అదనంగా గింజ లేకుండా ప్రభుత్వం కొంటుంది