Fraud : తెలంగాణలో నిరుద్యోగుల ఆశలను తమ లాభాలకు మార్గంగా మలుచుకునే మోసగాళ్ల చతురత రోజురోజుకీ పెరుగుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్పిస్తామని, ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వివిధ రూపాల్లో మోసాలు చేస్తున్నారు. అయితే ఈ సారి పురుషులే కాదు, ఓ మహిళ కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తాను హైకోర్టు జడ్జినని చెప్పి నిరుద్యోగుల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రసన్నా రెడ్డి అనే మహిళ, హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆశలు చూపింది. దీంతో ఆమె మాటలు నమ్మిన సుమారు 100 మందికి పైగా అమాయక నిరుద్యోగులు లక్షల రూపాయలు చెల్లించారు. మొత్తం రూ.కోట్లు వసూలు చేసిన ఆమె, నిర్దాక్షిణ్యంగా వారిని మోసం చేసి గల్లంతయ్యింది.
Nadendla Manohar: పిఠాపురంలో రేషన్ బియ్యం సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
ఇటీవల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన ప్రసన్నా రెడ్డి, అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు సీఐకి తాను హైకోర్టు జడ్జినని చెబుతూ ప్రత్యేక దర్శనం పొందింది. అయితే ఆమె మోసాల గురించి ఇప్పటికే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, కరీంనగర్ జిల్లా మధురానగర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు పోలీసులు వెలికితీస్తున్నారు. ఉద్యోగాల పేరుతో అమాయకులని మోసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.
Yuzvendra Chahal: ముంబైకి చుక్కలే.. వచ్చేస్తున్న స్పిన్ మాంత్రికుడు..?