తాను ఎక్కడికి వెళ్లిన రెడ్‌బుక్ ప్రస్తావణ వస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. రెడ్‌బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఏందుకంటే.. దాని పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తుందని, మరి కొందరికీ బాత్‌రూంలో కాలు జారిపడి చేయి విరగ్గొట్టుకుంటున్నారని అన్నారు. అధికారంలో ఉన్నామని గర్వం ఇగోలు వద్దాన్నారు. “అర్థమైందా రాజా” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Rashmika: 59 ఏళ్ల హీరోతో నటించిన రష్మిక.. ఆఫర్ వచ్చినప్పుడు తన ఫస్ట్ రియాక్షన్ ఇదే!
మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి సమాచారం అందించారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. క్లైమోర్ మైన్స్ కే భయ పడలేదు.. కామెడీ పీస్ కు భయపడతామా? అన్నారు.. అనంతరం పార్టీ గురించి నారా లోకేష్ మాట్లాడారు. ఈవీఎం అయినా బ్యాలెట్ అయిన గెలుపు మనదే అని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. “ప్రజలకోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది. చాలీ చాలని పెన్షన్ 5 వేలు అయింది. టీడీపీ కార్యకర్తల పార్టీ. తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు. నేను పార్టీ కోసం కూడా పోరాడుతున్నాను. కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి.. గ్రామ స్థాయిలో కార్యకర్తలు జిల్లా స్థాయికి ఎదగాలి. నాతో నే పార్టీ లో సంస్కరణ మొదలు కావాలి. మూడు సార్లు ఒకే పదవిలో ఉన్న తర్వాత వేరే బాధ్యతలు తీసుకోవాలి. పొలిట్ బ్యూరో సభ్యులు యువకులని ప్రోత్సహిస్తున్నారు.” అని ఆయన వ్యాఖ్యానించారు.