రెండు రోజుల్లో ముగుస్తుందనుకున్న రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం500 రోజులుగా కొనసాగుతుంది. 2022ను యుద్ధనామసంవత్సరంగా మారింది.. 2022, ఫిబ్రవరి 24న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం ప్రారంభమయినప్పుడు ఇన్ని రోజుల పాటు కొనసాగుతుందని ఎవరు అనుకోలేదు. నాలుగైదు రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందని అందరు అనుకున్నారు. అసలు యుద్ధం లక్ష్యమేంటో తెలియనప్పటికీ నెలరోజులలోపు ఉక్రెయిన్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటుందని అందరు అంచనా వేశారు. కానీ పరిస్థితులు తలకిందులయ్యాయి.
Russia: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం డ్రోన్ అటాక్ జరిగింది. రాజధాని సమీపంలో ఐదు డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే ఈ చర్యకు అమెరికా, నాటోనే కారణం అని.. వీటి సాయం లేకుండా రష్యా భూభాగంపై డ్రోన్ దాడులు సాధ్యం కాదని రష్యా ఆరోపించింది.
తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రామాటోర్స్క్‌ను మంగళవారం రెండు రష్యా క్షిపణులు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా కనీసం నలుగురు మరణించారు, మరో 42 మంది గాయపడ్డారు. మొదటి క్షిపణి రెస్టారెంట్‌ను తాకింది, గణనీయమైన నష్టాన్ని కలిగించింది.
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు రష్యా తరపున పోరాడిన సైన్యమే ఇప్పుడు ఎదురు తిరిగింది. రష్యా సైనిక నాయకత్వమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేస్తోంది. సాయుధ పోరాటానికి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పిలుపునిచ్చారు.
ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడికి రష్యా సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రష్యా సిద్ధం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోహరించడానికి బెలారస్ దేశంతో చర్చలు జరిపి అంగీకరింప చేసుకుంది.
Russia-Ukraine War: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో 500 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆదివారం నాడు రెండేళ్ల బాలిక మరణించినట్లు చెప్పారు. చిన్నారుల మరణాల సంఖ్యను కచ్చితంగా చెప్పడం కష్టం.
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుంది తెలుసు. ఏకంగా ఆస్కార్‌కి నామినేట్ అయి అవార్డును సైతం సొంతం చేసుకుంది. నాటు నాటు పాట డ్యాన్స్ ను దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది.
Russia: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్( FATF) నుంచి రష్యాను సస్పెండ్ చేశారు.