రష్యా దాడులు శుక్రవారం ఉక్రెయిన్ అంతటా నగరాలను దెబ్బతీశాయి. ఉక్రెయిన్‌పై శుక్రవారం తెల్లవారుజామున రష్యా ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పిల్లలతో సహా 26 మంది మరణించారు. మాస్కో దళాలపై ఎదురుదాడికి కీవ్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ దాడులు జరిగాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరికొన్ని నగరాలపై రష్యా తెల్లవారుజామునే దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఉక్రేనియన్ దళాలు త్వరలో దాని పాశ్చాత్య మిత్రదేశాల నుంచి వచ్చిన ట్యాంకులతో సహా కొత్త సైనిక పరికరాలతో దాడిని ప్రారంభించాలని భావిస్తున్నందున రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Volodymyr Zelensky: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో అంతం అయ్యేలా కనిపించడం లేదు. రష్యా నెమ్మనెమ్మదిగా ఉక్రెయిన్ పై పట్టు సాధిస్తోంది. ఇప్పటికే అత్యంత కీలకం అయిన బఖ్ మూత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 70 శాతం ప్రాంతాన్ని రష్యా నియంత్రణలోకి తీసుకుంది. దీంతో పాటు మూడు వైపుల నుంచి భారీగా దాడులు చేస్తోంది. ఇటీవల రష్యా జరిపిన దాడుల్లో ఏకంగా 400 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి బఖ్ మూత్…
రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరంకు పైగా యద్దం కొనసాగుతుంది. రష్యాపై తీవ్రమైన ఆరోపణలకు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ దిగాడు. ఐసీస్ కంటే రష్యా ప్రమాదకరమైందని.. ఆ దేశ సైనికుల అకృత్యాలు మరీ దారుణంగా ఉంటున్నాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ విమర్శించారు.
ఈ రోజు మీరు మీ జీవితంలో ఎంత సంతృప్తిగా లేదా సంతోషంగా ఉన్నారు? ఉక్రెయిన్, రష్యా, పాకిస్థాన్, ఇరాక్, శ్రీలంక వంటి యుద్ధం లేదా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లోని ప్రజల కంటే భారతీయులు సంతోషంగా లేరని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 వెల్లడించింది.
Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బఖ్ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ బఖ్ముత్ చేజారిపోకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బఖ్ముత్ కేంద్రంగా మారణహోమం జరుగుతోంది. నెలల తరబడి ఈ పట్టణంపై ఆధిపత్యం కనబరిచేందుకు రష్యన్ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ విరుచుకుపడింది. దాదాపు 81 క్షిపణులతో తాజాగా దాడి చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా పెను దాడి చేసింది. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏదో ఒకరోజు తన ఆంతరింగికులతోనే చంపబడతాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. న్యూస్వీక్లోని ఒక నివేదిక ప్రకారం, ఈ వ్యాఖ్యలు జెలెన్స్కీ ఉన్న 'ఇయర్' అనే ఉక్రేనియన్ డాక్యుమెంటరీలో భాగంగా బయటకు వచ్చాయి.
ఉక్రెయిన్‌పై మాస్కో దాడికి సంబంధించి రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ శుక్రవారం తెలిపింది.
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి విమానం ఎక్కబోయి మెట్లపై నుంచి జారిపడిపోబోయారు. ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని బైడెన్ అమెరికాకు తిరిగి పయనమయ్యారు.