Russia Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అనేక మంది చనిపోతున్నారని ప్రతిరోజూ వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో అమాయక పౌరులే కాదు, ఇరు దేశాల మధ్య పోరాడుతున్న సైనికులు కూడా బలి అవుతున్నారు.
దాదాపు రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే, గత రాత్రి ఉక్రెయిన్ రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించింది. రష్యా రక్షణ వ్యవస్థలు క్రిమియాపై 16 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయి.
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ డబ్బులు సంపాదించుకునేందుకు ఆయుధాలను అమ్ముతుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ గత ఏడాది రెండు ప్రైవేట్ అమెరికాకు చెందిన కంపెనీలతో ఆయుధ ఒప్పందాలలో $364 మిలియన్లు సంపాదించినట్లు తెలుస్తుంది.
బ్రిటిష్ సైనిక కార్గో విమానం రావల్పిందిలోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నూన్ ఖాన్ నుంచి సైప్రస్, అక్రోతిరిలోని బ్రిటిష్ సైనిక స్థావరానికి, అక్కడి నుంచి రోమేనియాకు వెళ్ళింది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేసేందుకు మొత్తం ఐదుసార్లు ఇలా వెళ్లినట్లు బీబీసీ ఉర్దూ సోమవారం నివేదించింది. అయితే పాక్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఉక్రెయిన్‌కి గానీ, దాని పక్క దేశం రొమేనియాకు కానీ ఎలాంటి ఆయుధాలను అందించలేదని చెప్పింది.
ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత పెంచేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆరోపించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణను ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి విస్తరించాలని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయని షోయిగు చెప్పారు.
Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడికి తెగబడింది. ఖార్కివ్ తూర్పు ప్రాంతంలోని సూపర్ మార్కెట్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ప్రజలు పెద్ద ఎత్తున మరణించినతట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా జరిపిన ఈ రాకెట్ దాడిలో ఇప్పటి వరకు 49 మంది ప్రజలు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీ తెలిపారు.
Russia-Ukraine War: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేవు. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా అనుకున్నా.. వెస్ట్రన్ దేశాల ఆర్థిక, సైనిక, ఆయుధ సహాయంతో రష్యాకు ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. మరోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది.
Rayachoti Student Died In Ukraine: ఎన్నో ఆశలతో కొడుకును ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించారు ఆ తల్లిదండ్రులు. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి కొడుకును డాక్టర్ చేయాలని ఆశపడ్డారు. వాళ్ల ఆశలన్నీ అతనిపైనే పెట్టుకొని బతుకుతున్నారు. కొన్ని రోజుల్లో కొడుకు డాక్టర్ అయి తీరివస్తాడు కష్టాలు తీరతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలోనే వారికి తమ కొడుకు ఇక లేడు అనే చేదు వార్త తెలిసింది. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా…
రష్యా రాజధాని మాస్కోలో శనివారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో రాజధాని మాస్కోలోని మూడు ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడగా.. గత కొన్ని వారాలుగా డ్రోన్ల ద్వారా రాజధాని మాస్కో , పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.