PM Modi:రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తోంది. తొలిసారిగా భారత ప్రధాని నరేంద్రమోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీతో తొలిసారి భేటీ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ, జెలెన్స్కీ మధ్య వ్యక్తిగతంగా భేటీ కావడం ఇదే తొలిసారి.
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. దాదాపుగా ఏడాదిన్నర గడుస్తున్నా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతుందే తప్పా.. తగ్గడం లేదు. వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆయుధ, ఆర్థిక సాయంతో ఉక్రెయిన్, రష్యాను నిలువరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఉక్రెయన్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపించింది. 30 క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించింది. వీటిలో 29 క్షిపణులను కూల్చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మంగళవారం రష్యా జరిపిన క్షిపణి దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 18 క్షిపణులను కూల్చివేశాయని ఉక్రెయిన్ దేశ అధికారులు తెలిపారు. యూఎస్ పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్‌తో అర డజను రష్యన్ హైపర్‌సోనిక్ క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది.
ఉక్రెయిన్ కు తాము దీర్ఘ శ్రేణి క్షిపణులు పంపుతామని బ్రిటన్ ఇటీవలే ప్రకటించింది. ఇంకా ఏం చేయాలన్న విషయంపై జెలెన్ స్కీతో చర్చించానని రిషి సునక్ ఇవాళ వెల్లడించారు. తమకు సాయం చేస్తున్నందుకు ఉక్రెయిన్ ప్రజల తరఫున, సైనికుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు.
Viral Video: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు బద్ధశతృవులుగా మారాయి. ఈ శతృత్వం ప్రజలు, రాజకీయ నాయకుల్లో కూడా పేరుకుపోయింది. ఇందుకు ఓ వీడియో ప్రస్తుతం సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ గ్లోబల్ సమావేశంలో రష్యా ప్రతినిధిని ఉక్రెయిన్ ఎంపీ కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. టర్కీ రాజధాని అంకారాలో గురువారం బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్ డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ రాత్రిపూట రెండు డ్రోన్లతో క్రెమ్లిన్పై దాడి చేసేందుకు ప్రయత్నించిందని రష్యా అధికారులు బుధవారం ఆరోపించారు
ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఉక్రెయిన్ యత్నించిందని రష్యా నేడు ఆరోపించింది. ఆరోపించిన దాడికి ఉపయోగించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు పేర్కొంది.
Ukraine 'Maa Kali' tweet: ఉక్రెయిన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘‘కాళీ మాత’’ అగౌరపరిచేలా వివాదాస్పద ట్వీట్ చేసింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ చేసింది. రష్యాలో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత ఓ వెలువడిన పోగపై కాళీ మాతను తలిపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తు తెచ్చేలా ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’అనే క్యాప్షన్ తో…
Zelensky: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరికి సంవత్సరం గడిచింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్దం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్, ఖేర్సర్, లూహాన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను కూడా కోల్పోయింది.