రష్యా రాజధాని మాస్కోలో భారీ డ్రోన్ దాడి కలకలం రేపుతుంది. పలు డ్రోన్లు ఏకకాలంలో దాడి చేయడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అప్రమత్తమైన రష్యా సైన్యం డ్రోన్లను కూల్చివేసింది. డ్రోన్ దాడి తరువాత మాస్కోలో విమానాల రాకపోకలను ఆపేశారు. ఈ దాడిలో రెండు బిల్డింగ్ లు దెబ్బతిన్నాయి. అయితే, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. రష్యా రాజధాని మాస్కో మేయర్ సెర్గే సోబియానిన్ ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. మాస్కోపై రాత్రి సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో రెండు భవనాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు.
Read Also: Kiara Advani: ఆ కోరిక కోసం తహతహలాడుతున్న కియారా.. ఎప్పుడు తీరుతుందో?
ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 500 కిలో మీటర్లు దూరంలో ఉన్న రష్యా రాజధాని మాస్కో, దాని పరిసరాలపై ఈ డ్రోన్ల ద్వారా దాడి చేసినట్లు మాస్కో మేయర్ ప్రకటించారు. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నారు. తాజా డ్రోన్ల దాడితో రాజధాని యొక్క వ్యకోవ్ విమానాశ్రయం పూర్తిగా మూసి వేయబడింది. ఎయిర్ పోర్ట్ కు రాకపోకలు నిలిపివేసినట్లు ఏవియేషన్ సర్వీసెస్ వెల్లడించింది. ఈనెల ప్రారంభంలో డ్రోన్ దాడుల కారణంగా మాస్కోకు విమానాల రాకపోకలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది. అయితే, శనివారం అర్థరాత్రి తరువాత జరిగిన డ్రోన్ల దాడిలో ఐదు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు.
Read Also: Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో స్టీలు హుండీలు.. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన టీటీడీ
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య 2022 ఫిబ్రవరి నెల నుంచి యుద్దం కొనసాగుతుంది. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని వెనక్కి తీసుకునేందుకు ఉక్రెయిన్ మాస్కోపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శుక్రవారం రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దక్షిణ రోస్టోవ్ ఏరియాలో రెండు ఉక్రెయిన్ క్షిపణులను అడ్డగించిందని టాగన్‌రోగ్ నగరంపై శిథిలాలు పడటంతో 16 మందికి గాయాలైనట్లు రష్యా వెల్లడించింది. ఇదిలా ఉంటే శనివారం రాత్రి మాస్కోపై డ్రోన్‌ల దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాస్కోలోని ఒక అపార్ట్ మెంట్ భవనంలో మహిళ నిద్రిస్తుండగా డ్రోన్ ఢీకొట్టినట్లు ఓ వీడియోలో కనబడుతుంది.