రష్యా రాజధాని మాస్కోలో శనివారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో రాజధాని మాస్కోలోని మూడు ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడగా.. గత కొన్ని వారాలుగా డ్రోన్‌ల ద్వారా రాజధాని మాస్కో , పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
గత మూడు నెలులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే. యుద్ధం నేపథ్యంలో రష్యాను కొన్ని దేశాలు సమర్థిస్తుండగా.. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఉక్రెయిన్‌కు సహాయ సహకారాలు అందిస్తోంది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల నుంచి హింసాత్మక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉక్రెయిన్ మాస్కోపై ప్రతీకారం తీర్చుకుంది. దీని కారణంగా రష్యా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది.
డెన్మార్క్, నెదర్లాండ్స్ నుంచి ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను డెలివరీ చేయడానికి అమెరికా ఆమోదించింది. ఆ దేశ పైలట్‌లు శిక్షణ పొందిన తర్వాత వాటిని అప్పగించేందుకు అనుమతిస్తామని వాషింగ్టన్ తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.
రష్యా రాజధాని మాస్కోలో భారీ డ్రోన్ దాడి కలకలం రేపుతుంది. పలు డ్రోన్లు ఏకకాలంలో దాడి చేయడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అప్రమత్తమైన రష్యా సైన్యం డ్రోన్లను కూల్చివేసింది. డ్రోన్ దాడి తరువాత మాస్కోలో విమానాల రాకపోకలను ఆపేశారు.
రష్యా సైన్యంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఓ మిత్ర దేశం ఆ ఆయుధాలను గతంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకుని.. తమకు సరఫరా చేసినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపినట్లు వార్తాసంస్థ వెల్లడించింది.
రష్యాపై యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ క్లస్టర్ ఆయుధాలను వాడుతోంది. అమెరికా ఉక్రెయిన్‌కు పంపిన క్లస్టర్ ఆయుధాలు రష్యాపై జరుగుతున్న యుద్ధంలో ఉపయోగిస్తుంది