Russia-Ukraine War:రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల నుంచి హింసాత్మక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉక్రెయిన్ మాస్కోపై ప్రతీకారం తీర్చుకుంది. దీని కారణంగా రష్యా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. తాజా దాడిలో రష్యా ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఉక్రెయిన్‌లోని చారిత్రక నగరమైన చెర్నిహివ్‌లోని సెంట్రల్ స్క్వేర్‌ను రష్యా క్షిపణి ఢీకొనడంతో 6 ఏళ్ల చిన్నారితో సహా ఏడుగురు మరణించారని, 90 మంది గాయపడ్డారని అంతర్గత మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
Read Also: Gold Seized: లుంగీలో బంగారం.. కేటుగాడి గుట్టురట్టు చేసిన కస్టమ్స్ అధికారులు
ఈ క్షిపణి దాడి జరిగినప్పుడు మతపరమైన సెలవుదినాన్ని జరుపుకోవడానికి చర్చికి వెళ్తున్నారని, గాయపడిన వారిలో 12 మంది పిల్లలు, 10 మంది పోలీసు అధికారులు ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. చెర్నిహివ్ నగరం మధ్యలో ఓ ప్రాంతం ఈ రష్యన్ క్షిపణి దాడి జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రస్తుతం స్వీడన్ పర్యటనలో ఉన్నారు. అయితే టెలిగ్రామ్‌లో రష్యా దాడిని ఆయన ఖండించారు. క్షిపణి చెర్నిహివ్‌లో పడిపోయిందని అన్నారు. క్షిపణి దాడి చేసిన చోట పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం, థియేటర్ కూడా ఉంది.జిట్‌లో ఉన్న ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసారు.
Read Also: Akhilesh Yadav: మణిపూర్‌లో జీ20 సదస్సును నిర్వహించండి.. కేంద్రంపై అఖిలేష్ మండిపాటు
చెర్నిహివ్ నగర ప్రజలకు ఒక సాధారణ రోజును రష్యా బాధాకరమైన రోజుగా మార్చిందని జెలెన్స్కీ అన్నారు. జెలెన్స్కీ తన పోస్ట్‌తో ఒక చిన్న వీడియోను పోస్ట్ చేశారు. ఇది ప్రాంతీయ డ్రామా థియేటర్ ముందు కూడలిలో చెత్తాచెదారం, అక్కడ పార్క్ చేసిన దెబ్బతిన్న కార్లను చూపిస్తుంది. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన సుమారు 5 లక్షల మంది సైనికులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
రష్యా గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన దండయాత్రలో భాగంగా ముందు వరుసకు దూరంగా ఉన్న ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసింది. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తున్నా.. ఇప్పటికీ యుద్ధం ముగింపు దిశగా ఎటుంటి సంకేతాలు కనిపించడం లేదు. రష్యా సేనల భీకర దాడులతో ఉక్రెయిన్‌లో ఆస్తి, ప్రాణ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో మాస్కో దూకుడు కనబర్చినా.. ఆ తర్వాత కీవ్ సైతం పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో ఎదురుదాడులకు దిగుతోంది.