Ukraine War: ఉక్రెయిన్ సూపర్ మార్కెట్‌పై రష్యా దాడి.. 49 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడికి తెగబడింది. ఖార్కివ్ తూర్పు ప్రాంతంలోని సూపర్ మార్కెట్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ప్రజలు పెద్ద ఎత్తున మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా జరిపిన ఈ రాకెట్ దాడిలో ఇప్పటి వరకు 49 మంది ప్రజలు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీ తెలిపారు.
రష్యా సరిహద్దుల్లో ఉన్న కుపియాన్స్క్ జిల్లాలోని గ్రోజా గ్రామంపై ఈ రాకెట్ దాడి జరిగిందని, గతంలో ఈ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుందని, ఆ తరువాత ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకోవడంతోనే రష్యా దళాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని జెలెన్ స్కీ ఆరోపించారు. ఒక సాధారణ దుకాణంపై రాకెట్ దాడి చేసి ప్రజలను చేయడం రష్యా చేసిన ఉగ్రవాద దాడి అని విమర్శించారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 26 వేల మంది మిస్సింగ్..
గ్రోజా గ్రామంలో కేఫ్, గ్రాసరీ దుకాణంపై దాడి జరిగినట్లు ఖార్కివ్ ప్రాంత చీఫ్ ఒలేగ్ సినెగుబోవ్ తెలిపారు. దాడి జరిగి గ్రామం కుపియాన్స్క్ కి పశ్చిమా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధానికి ముందు ఈ ప్రాంతంలో 500 మంది జనాభా ఉన్నట్లు అంచనా. దాడిలో చనిపోయిన 49 మందిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరో చిన్నారి గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
2022 ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అమెరికా, యూకే లాంటి వెస్ట్రన్ దేశాల సహాయంతో ఉక్రెయిన్, రష్యాకు ఎదురొడ్ది పోరాడుతోంది. రష్యా ముందు ఎంతో చిన్నదైన ఉక్రెయిన్ కొన్ని వారల్లోనే లొంగిపోతుందని అంతా భావించినా, ఏడాదిన్నర కాలంగా యుద్ధం జరుగుతూనే ఉంది. పలుమార్లు చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించింది, అయితే ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించుకున్న జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను చర్చల్లోకి తీసుకురావద్దని రష్యా చెబుతోంది. ఉక్రెయిన్ మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నంత కాలం చర్చల ప్రసక్తే లేదని చెబుతోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!