Uddhav Thackeray: ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఠాక్రేల ఆధిపత్యానికి గండికొడుతూ.. 25 ఏళ్ల తర్వాత బీజేపీ+షిండే శివసేన సత్తా చాటాయి. 227 స్థానాలు ఉన్న ముంబైలో మెజారిటీ మార్క్ 114. బీజేపీ 89 స్థానాలు సాధించగా, షిండే శివసేన 29 స్థానాల్లో గెలిచింది.
Uddhav Thackeray: తాను ప్రధాని నరేంద్రమోడీ కోసం రెండుసార్లు ప్రచారం చేశానని, కానీ ఆయన తన పార్టీని రెండుగా చీల్చారని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 2014, 2019లో ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఇప్పుడు తన పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని ప్రధాని చేయాలని తాను చెప్పానని, ఇప్పుడు నన్ను అంతం చేయాలని అంటున్నారని ఠాక్రే అన్నారు. ఇప్పుడు ఈ రెండు విషయాలను ప్రజలు గమనించడం ప్రారంభించారని చెప్పారు.
Maharashtra: మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు.
Raj Thackeray: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మహా వికాస్ అఘాడి (MVA), రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) నాయకులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు
Eknath Shinde: 26/11 ముంబై ఉగ్ర దాడుల తర్వాత, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోకపోవడం ‘‘ద్రోహం’’ అని శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఎవరి ఒత్తిడితో కాంగ్రెస్ పాకిస్తాన్‌పై దాడికి సిద్ధ పడలేదని ప్రశ్నించారు. శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే తన సొంత పార్టీ అనుచరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
India-Pakistan match: బీజేపీ ఫైర్ బ్రాండ్, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మరోసారి ఉద్ధవ్ సేన పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చుట్టూ ఉన్న వివాదం నేపథ్యంలో, మ్యాచ్‌పై ఉద్ధవ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నితేష్ రాణే, ఆదిత్య ఠాక్రేపై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిత్య ఠాక్రే బురఖా ధరించి మ్యాచ్‌ను రహస్యంగా చూస్తాడని రాణే ఆరోపించారు.
Raj Thackeray: 13 సంవత్సరాలలో మొదటిసారిగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి వెళ్లారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజును సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఠాక్రే చివరిసారిగా 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించిన సమయంలో మాతోశ్రీలోకి ప్రవేశించారు.
Nitesh Rane: మరాఠీ భాషపై ఇద్దరు సోదరులు రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయారు. 20 ఏళ్ల తర్వాత, ఒకే వేదికను పంచుకున్నారు. ఇకపై తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో త్రిభాషా విధానంలో భాగంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. మరాఠీలపై హిందీ రుద్దాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
MK Stalin: జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా, హిందీ భాష విధింపుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఈ వివాదమే 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసేందుకు సాయపడింది.