India-Pakistan match: బీజేపీ ఫైర్ బ్రాండ్, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మరోసారి ఉద్ధవ్ సేన పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చుట్టూ ఉన్న వివాదం నేపథ్యంలో, మ్యాచ్‌పై ఉద్ధవ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నితేష్ రాణే, ఆదిత్య ఠాక్రేపై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిత్య ఠాక్రే బురఖా ధరించి మ్యాచ్‌ను రహస్యంగా చూస్తాడని రాణే ఆరోపించారు.
‘”ఆదిత్య థాకరే రేపు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ను బుర్ఖాలో దాక్కుని చూస్తాడు. అతను పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు కూడా చేస్తాడు” అని రాణే అన్నారు. ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ మెరైన్ డ్రైవ్‌లో బ్లాక్ టికెట్లు అమ్ముతారని దుయ్యబట్టారు. దీనికి ముందు, ఇండియా-పాకిస్తాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌పై బీసీసీఐ నిర్ణయాన్ని ఖండిస్తూ, జాతివ్యతిరేకి అంటూ ఆదిత్య ఠాక్రే కామెంట్స్ చేశారు.
Read Also: PM Modi Manipur Visit: ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన బాధితులు..
“బీసీసీఐ దేశ వ్యతిరేకిగా మారుతోంది. పాకిస్థాన్‌తో ఆడటానికి బీసీసీఐ ఎందుకు అంత ఉత్సాహంగా ఉంది? డబ్బు, టీవీ ఆదాయం, ప్రకటనల ఆదాయం కోసం దురాశ కారణంగానా లేదా ఆటగాళ్ల ఫీజుల కోసమా? కేవలం భారతదేశంలో ఉన్నందున పాకిస్థాన్ ఆసియా కప్‌ను బహిష్కరించగలిగినప్పుడు, బీసీసీఐ ఎందుకు అలా చేయకూడదు?” అని ఆదిత్య ఠాక్రే అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పౌరుల్ని చంపేశారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన దేశంతో భారత్ క్రికెట్ ఆడగటం ఏంటని మోడీ ప్రభుత్వంపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. పహల్గామ్ గాయాలు మాననప్పటికీ, పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేందుకు చూస్తోందని విమర్శించారు. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేదు’’ అనే ప్రధాని మాటల్ని గుర్తు చేస్తూ,‘‘యుద్ధం, క్రీడలు కూడా కలిసి ప్రవహించేందుకు సిద్ధంగా లేవు’’ అని ఠాక్రే అన్నారు.