Uddhav Thackeray: తాను ప్రధాని నరేంద్రమోడీ కోసం రెండుసార్లు ప్రచారం చేశానని, కానీ ఆయన తన పార్టీని రెండుగా చీల్చారని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 2014, 2019లో ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఇప్పుడు తన పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని ప్రధాని చేయాలని తాను చెప్పానని, ఇప్పుడు నన్ను అంతం చేయాలని అంటున్నారని ఠాక్రే అన్నారు. ఇప్పుడు ఈ రెండు విషయాలను ప్రజలు గమనించడం ప్రారంభించారని చెప్పారు.
మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేయడం బీజేపీ పాత కల అని ఠాక్రే ఆరోపించారు. ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే లేరని (మరియు) వారు కాగితంపై సేనను అంతం చేశారని వారు భావిస్తున్నారు. కానీ వారు క్షేత్రస్థాయిలో అలా చేయలేరని అన్నారు. బాలా సాహెబ్ ఉన్నప్పుడు వారు నిజాయితీగా ఉండేవారని అన్నారు. రాజకీయల్లో ప్రమాణాలు పడిపోవడానికి బీజేపీ ఒక నిదర్శనం అని విమర్శించారు.