మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం వెలుగుచూసింది. దాయాదులుగా ఉన్న అన్నాదమ్ముళ్లిద్దరూ 20 సంవత్సరాల తర్వాత ఒక్కటయ్యారు. మరాఠీ భాష కోసం ఒకే వేదిక పంచుకున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సరికొత్త చరిత్రగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
త్రిభాషా రగడ ఇప్పుడు తమిళనాడు నుంచి మహారాష్ట్రకు మళ్లింది. త్రిభాషా విధానాన్ని ఇప్పటికే తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మహాయతి ప్రభుత్వం 1-5 తరగతుల్లో మరాఠీ, ఆంగ్లంతో పాటు హిందీని తప్పని చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Raj Thackeray: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్‌ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్, ఠాక్రే బ్రాండ్లను అంతం చేసేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Milind Deora: పహల్గామ్ ఉగ్రదాడితో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో ఉంటే, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబంతో యూరప్‌లో సెలవులు గడిపేందుకు వెళ్లారని శివసేన నేత మిలింద్ దేవరా ఘాటు విమర్శలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే యూరప్‌లో హాలీడేస్ గడుపుతున్నారని మండిపడ్డారు.
Nitesh Rane: మహారాష్ట్రలో జాతీయ విద్య విధానం(ఎన్ఈపీ) అమలులో భాగంగా మరాఠీ, ఇంగ్లీష్‌తో పాటు హిందీని తప్పనిసరి చేయడాన్ని రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదమే, ఇప్పుడు మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలకు కారణమవుతోంది.
Sanjay Raut: మహారాష్ట్రలో ‘‘హిందీ వివాదం’’ నేపథ్యంలో విడిపోయిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసి పోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తనకు ఉద్ధవ్‌కి మధ్య ఉన్నవి చిన్న విభేదాలే అని, మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవి అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
Maharashtra: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రింటింగ్ చేస్తోంది.
Devendra Fadnavis: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏప్రిల్ 02న లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనుంది. సభలో బిల్ పాస్ కావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, అడ్డుకునేందుకు కాంగ్రెస్, ఇండీ కూటమి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇరు పార్టీలు తమ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. రాబోయే మూడు రోజులు సభకు ఖచ్చితం రావాలని ఆదేశించాయి.