Nitesh Rane: ‘‘జిహాదీ, హిందూ వ్యతిరేక ర్యాలీ’’.. ఠాక్రేలు పీఎఫ్ఐ, సిమి కన్నా తక్కువ కాదు..
- ఠాక్రే సోదరుల ర్యాలీపై విరుచుకుపడిన బీజేపీ మంత్రి నితేష్ రాణే..
- వారిది జిహాదీ, హిందూ వ్యతిరేక ర్యాలీ..
- సిమి, పీఎఫ్ఐల కన్నా వీరిద్దరు తక్కువ కాదు అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitesh Rane: మరాఠీ భాషపై ఇద్దరు సోదరులు రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయారు. 20 ఏళ్ల తర్వాత, ఒకే వేదికను పంచుకున్నారు. ఇకపై తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో త్రిభాషా విధానంలో భాగంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. మరాఠీలపై హిందీ రుద్దాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అయితే, ఈ విధానంపై వ్యతిరేకత రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అయితే, దీనిని విజయంగా భావిస్తూ ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలుసుకున్నారు.
Read Also: Warangal: జిల్లా కాంగ్రెస్ నేతల వర్గ పోరుపై అధిష్టానం దృష్టి.. గాంధీభవన్‌కు రావాలని పిలుపు..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అయితే, ఈ కలయికపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి నితేష్ రాణే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది హిందువులను బలహీనపరిచే కుట్రగా అభివర్ణించారు. వీరిద్దరు నిర్వహించిన ర్యాలీ హిందూ వ్యతిరేకమని, ప్రజల్ని హిందువులు, మరాఠీలుగా విభజించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఠాక్రే సోదరుల ర్యాలీని జీహాది, హిందూ వ్యతిరేక ర్యాలీగా అభివర్ణించారు. ఇది సమాజాన్ని విభజిస్తుందని, రాష్ట్రాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు.
శుక్రవారం మీడియాతో రాణే మాట్లాడుతూ.. ‘‘మేము హిందువులం, మరాఠీలుగా ఉండటం మాకు గర్వకారణం. జిహాదీలు మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించే విధానం. ఈ వ్యక్తులు కూడా ఇదే చేస్తున్నారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) లేదా సిమికి వీరు భిన్నంగా లేరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాక్రేల ర్యాలీ హిందువులు ఎక్కువగా నష్టపోతారు, తర్వాత నల్ బజార్(ముస్లిం ఆధిపత్య ప్రాంతం)లో స్వీట్లు పంపిణీ చేయబడుతాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!